Living Relationship : వైవాహిక జీవితం అంటే ఆడ, మగ మధ్య జరిగేది. ఇది ప్రకృతి సహజం.. కానీ ఇటీవల ఆడ, ఆడ.. మగ, మగ కూడా వైవాహిక బంధాలు మొదలు పెడుతున్నారు. ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఈ కల్చర్ పెరుగుతోంది. కొన్ని దేశాలు ఈ లెస్బియన్ రిలేషన్‌షిప్‌కు చట్టబద్ధత కూడా కల్పించాయి. సంసన్నులు, గొప్ప స్థితిలో ఉన్నవారు కూడా ఈ సంస్కృతికి అలవాటు పడుతున్నారు. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారన్నది మాత్రం ఎవరికీ అంతుచిక్కడ మేదు. తాజాగా కేరళ రాష్ట్రంలో ఇలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇద్దరు యువతుల జంట కోర్టును ఆశ్రయించింది. కేరళ హైకోర్టు జూలై 5న ఈ కేసుపై విచారణ జరిపి, కేరళ పోలీసు డీజీపీ, పోలీసు కమిషనర్‌కు ఇద్దరు యువతులకు రక్షణ ఇవ్వమని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ జూలై 21న జరుపనున్నట్లు తెలిపింది. మరి ఆ యువతుల కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

స్నేహం నుంచి రిలేషన్‌షిప్ వరకు..
కేరళకు చెందిన అఫిఫా, సుమాయా ఒకే పాఠశాలలో 12వ తరగతి చదివారు. అక్కడే ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. లాక్‌డౌన్ టైమ్ లో లెస్బియన్∙జంటల్లా వీరిద్దరు లివిన్ రిలేషన్ షిప్ మొదలుపెట్టారు. ఇద్దరిది ఒకే లాంటి మనస్తత్వం కావడంతో ప్రేమలో పడ్డామని తెలిపారు. వీరి సంబంధం గురించి ముందుగా అఫిఫా ఇంట్లోవారికి తెలిసింది. 2023, జనవరి 27న ఇద్దరు ఇళ్లు విడిచి వెళ్లారని వారి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో ఈ జంట జనవరి 29న మలప్పురం జిల్లా కోర్టులో హాజరయ్యారు. తాము ఇద్దరం కలిసి ఉండాలనుకుంటున్న విషయం కోర్టుకు చెప్పడంతో అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

కలిసి జీవనం..
ఓ కంపెనీలో పనిచేస్తోన్న ఈ జంట అప్పటి నుంచి కలిసి జీవించడం మొదలుపెట్టారు. కానీ, అఫిఫా తల్లిదండ్రులు, బంధువులు వారు పని చేసే దగ్గరికి వెళ్లి అఫిఫాను బలవంతంగా తీసుకెళ్లారు. దాంతో సుమాయా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఎలాంటి చర్యలు వారు తీసుకోలేదు. ఆ తర్వాత కేరళ హైకోర్టులో సుమాయా ఒక పిటిషన్ దాఖలు చేసింది. అఫిఫాను కోర్టు ముందు హాజరు పర్చాలని ఆదేశించింది. అయితే వారు కోర్టు ఆర్డర్ పాటించకుండా తమకు టైమ్ కావాలని అడిగారు. ఆ తర్వాత జూన్ 10 రోజులకు అఫిఫాను కోర్టుకు ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చారు. తల్లిదండ్రులు బెదిరిచడంతో అఫిఫా కోర్టులో సుమాయాతో కలిసి ఉండాలనుకోవడం లేదని తెలిపారు. అలాగే తన తల్లిదండ్రులతో ఉండాలనుకున్నట్లు అఫిఫా చెప్పింది. ఆ తర్వాత కొద్ది రోజులకు అఫిఫా సుమాయాకు ఫోన్ చేసి, కోర్టు ముందు చెప్పిందంతా కావాలని మాట్లాడింది కాదని, తన తల్లిదండ్రులు వైద్య చికిత్స చేయించారని తెలిపింది.
ఆ సంబంధం కోసమే కలిసి ఉండడం లేదు..
వనజా కలెక్టివ్ సంస్థ ద్వారా సుమాయా పోలీసుల సహాయంతో అఫిఫాను తన తల్లిదండ్రుల నుంచి రక్షించారు. కోర్టులో సుమాయాతో వెళ్లలేనని చెప్పిన పరిస్థితులను అఫిఫా వివరించారు. శారీరక సంబంధం కోసం మాత్రమే తాము కలిసి ఉండాలని అనుకుంటున్నామని అనేవారని, ఇలా ఆలోచించే వారితో మాట్లాడటం కూడా అర్థరహితం అని తెలిపింది. తమను అర్థం చేసుకునే విధంగా వారిని మార్చలేం అని పేర్కొంది. డాక్టర్లే మా బంధాన్ని అర్థం చేసుకోలేదని, సొసైటీ, తల్లిదండ్రులు ఎలా అర్థం చేసుకుంటారని సుమాయా, అఫిఫా చెప్పుకొచ్చారు.