Afghanistan vs Australia : టీ20 వరల్డ్ కప్ లో పెను సంచలనం నమోదైంది. సూపర్ 8 లో బలమైన ఆస్ట్రేలియాపై అప్ఘనిస్తాన్ గెలిచి సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియాపై 21 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ రేసులో నిలిచింది. దీంతో గ్రూప్ 1 టేబుల్ ను ఆసక్తికరంగా మార్చింది. ప్రస్తుతం గ్రూప్ 1లో ఇండియా రెండు మ్యాచులు గెలిచి 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా..ఆ తర్వాత చెరో 2 పాయింట్లతో ఆస్ట్రేలియా, అప్ఘనిస్తాన్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చివరి మ్యాచుల్లో ఇండియాతో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ తో అప్ఘనిస్తాన్ తలపడుతాయి. ఈ మ్యాచుల్లో ఆస్ట్రేలియా గెలిస్తేనే సెమీస్ కు వెళుతుంది. ఇక బంగ్లాదేశ్ పై అప్ఘనిస్తాన్ గెలిస్తే రన్ రేట్ ను బట్టి సెమీస్ వెళాయి..
ఒకవేళ ఇండియా చేతిలో ఆస్ట్రేలియా ఓడి బంగ్లాదేశ్ పై అప్ఘనిస్తాన్ గెలిస్తే రన్ రేట్ తో సంబంధం లేకుండా 4 పాయింట్లతో సెమీస్ రేసులో అప్ఘనిస్తాన్ నిలుస్తుంది. అందుకే రాబోయే రెండు మ్యాచులు అత్యంత కీలకం..
తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘనిస్తాన్ కు ఓపెనర్లు గుర్బాజ్ 60 పరుగులు, ఇబ్రహ్మం జర్దాన్ 51 పరుగులతో బలమైన పునాది వేశారు. తర్వాత ఎవరూ రాణించకపోవడంతో అప్ఘన్ 148-6 పరుగులకు పరిమితమైంది.
అయితే తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు అప్ఘన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కట్టిపడేశారు. ప్రమాదకర హెడ్ ను డకౌట్ చేసి వార్నర్ ను 3 పరుగులకే కట్టిపడేశారు. ఇక మ్యాక్స్ మెల్ మాత్రమే 59 పరుగులతో పోరాడారు. గత వన్డే వరల్డ్ కప్ లో ఇదే మ్యాక్స్ వెల్ కాళ్లు పట్టేసినా కూడా 201 పరుగులతో డబుల్ సెంచరీ చేసి తన ఆస్ట్రేలియాను గెలిపించాడు. కానీ ఈసారి కూడా అలానే కనిపించాడు. కానీ గుల్బదిన్ 4 వికెట్లు తీసి అప్ఘనిస్తాన్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. గుల్బదిన్ కీలకమైన మ్యాక్స్ వెల్ సహా కీలక వికెట్లు తీసి ఆస్ట్రేలియాను ఓడించాడు.
అప్ఘన్ గెలుపుతో ఇప్పుడు సెమీస్ రేసు రసవత్తరంగా మారింది. గత వన్డే ప్రపంచకప్ లో భారత్ ను ఓడించి ఆస్ట్రేలియా కప్ గెలిచింది. ఇప్పుడు ఆస్ట్రేలియాను ఓడించి టీ20 వరల్డ్ కప్ నుంచి ఇంటికి పంపే సదావకాశం టీమిండియాకు దక్కింది. మరి మనోళ్లు గెలిచి అప్ఘనిస్తాన్ ను సెమీస్ చేరుస్తారా? లేదా? అన్నది వేచిచూడాలి.