https://oktelugu.com/

Georgi Reddy : జార్జి రెడ్డిలో అలా కనిపించిన ఈ నటి ఇప్పుడు కుర్రాల్ల గుండెలు పిండేస్తుంది..

2019లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా జార్జి రెడ్డి గురించి గుర్తుండే ఉంటుంది. చాలా చిన్న సినిమాగా వచ్చినా పెద్ద హిట్ ను ఇచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర గా నిలిచింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 23, 2024 / 08:52 AM IST

    This actress, who was seen in Georgi Reddy, is now making the hearts of boys.

    Follow us on

    Georgi Reddy : 2019లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా జార్జి రెడ్డి గురించి గుర్తుండే ఉంటుంది. చాలా చిన్న సినిమాగా వచ్చినా పెద్ద హిట్ ను ఇచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర గా నిలిచింది. ఓయూ విద్యార్థి నేత జార్జి రెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను జీవన్ రెడ్డి ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చారు. సిల్లి మాంక్స్ స్టూడియోస్, మిక్ మైక్, థ్రి లైన్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ సినిమాను అప్పి రెడ్డి నిర్మించారు. జార్జి రెడ్డి పాత్రలో తన సూపర్ నటనతో విమిర్శకుల ప్రశంసలు అందుకున్నాడు హీరో సందీప్ మాదవ్.

    అచ్చం జార్జి రెడ్డిలా.. రెట్రో లుక్ లో కనిపించి ప్రేక్షకుల హృదయాలు సొంతం చేసుకున్నాడు. తన నటనతో జార్జిరెడ్డిని మైమరపించాడు అని చెప్పవచ్చు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు ఈ హీరో. ఇక హీరో ఉంటే హీరోయిన్ ఉండాల్సిందే. ఇందులో హీరోయిన్ ఖుబ్ చాంద్ పాత్ర కూడా చాలా కీలకమే అని చెప్పాలి. మాయగా.. ముస్కాన్ పాత్రలలో కనిపించి తాను కూడా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

    అయ్యో మీకు బుల్లెట్ బండి సాంగ్ గుర్తుందా? మీలో చాలా మంది ఈ సాంగ్ కు డాన్స్ కూడా చేసి ఉంటారు. ఒకప్పుడు ఫుల్ ట్రెండింగ్ అయింది ఈ సాంగ్. ‘వాడు నడిపే బండీ రాయల్ ఎన్.ఫీల్డు అంటూ వస్తే చాలు పునాకాలే. వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు’ అంటూ మంగ్లీ పాడిన ఈ పాటకు ఆ రేంజ్ లో క్రేజ్ వచ్చి పడింది మరి. అయితే ఈ సినిమాతో ముస్కాన్ కు మంచి ఫాలోయింగ్ వచ్చిందనే చెప్పాలి. అయితే జార్జి రెడ్డి సినిమా తర్వాత ముస్కాన్ మరో సినిమా లో చేయలేదు. అవకాశాలు రాలేదా? లేదంటే అమ్మడు ఒప్పుకోలేదా తెలియదు కానీ ఏ సినిమాలో మాత్రం కనిపించలేదు. కేవలం రాజేశేఖర్ నటించిన శేఖర్ మూవీలో ఓ కీలకపాత్రలో కనిపించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇదిలా ఉంటే అమ్మడు ఫోటోలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.

    చిన్నప్పుడే జిమ్నాస్టిక్స్ నేర్చుకుంది ముస్కాన్. ఈమెకు కథక్ లోనూ ప్రావీణ్యం ఉందట. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటూనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. లేయార్ వోట్టా గర్ల్, లాక్మే, కాఫీ బైట్ వంటి యాడ్స్ లో కూడా నటించింది. అప్పుడే హిందీలో ది వెడ్డింగ్ మూవీలో నటించి మెప్పించింది. ఆ తర్వాత జార్జిరెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ముస్కాన్ జెన్ బుద్దీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దంపతులకు ఓ పాప కూడా ఉంది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం చైల్ట్ ఎడ్యుకేటర్‌గా పని చేస్తుంది.