
Rashmika Mandanna- Vijay Deverakonda: స్టార్ హీరోయిన్ రష్మిక మందాన కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. అదే సమయంలో వివాదాలు, ఎఫైర్ రూమర్స్ ఆమెను చుట్టుముడుతున్నాయి. కెరీర్ బిగినింగ్ నుండి రష్మికది ఇదే తీరు. ఈ కన్నడ బ్యూటీ కిరిక్ పార్టీ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. ఆ చిత్ర హీరో రక్షిత్ శెట్టితో ఎఫైర్ పెట్టుకున్నారు. పెళ్లికి సిద్ధమైన రష్మిక-రక్షిత్ ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. పెళ్లికి సమయం దగ్గరపడుతుండగా మనసు మార్చుకుంది. జస్ట్ బ్రేకప్ అంటూ… రక్షిత్ కి హ్యాండ్ ఇచ్చింది.
గత రెండేళ్లుగా ఆమె టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండకు దగ్గరయ్యారనే ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్ 5న రష్మిక బర్త్ డే కాగా… జంటగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు దొరికాయి. రష్మిక-విజయ్ దేవరకొండ ఒకే హోటల్ లో స్టే చేశారంటూ ఒకరు ట్వీట్ చేశారు. దానికి ప్రూఫ్ ఇదే అంటూ రష్మిక, విజయ్ దేవరకొండ ఫోటోలు జోడించారు. త్వరలో శుభవార్త చెప్పే అవకాశం కలదని కామెంట్ చేయడం జరిగింది.
ఈ ట్విట్టర్ పోస్ట్ పై రష్మిక స్పందించారు. రిప్లై పోస్ట్ చేశారు. ‘అయ్యో… మరీ ఎక్కువగా ఊహించుకోకు బాబు’ అని ఆమె ఒక లాఫింగ్, లవ్ ఎమోజీలు జోడించారు. విజయ్ దేవరకొండతో కలిసి బర్త్ డే జరుపుకున్నారన్న కామెంట్ పై రష్మిక సీరియస్ కాలేదు. కూల్ గా సమాధానం చెప్పింది. గతంలో కూడా ఎప్పుడూ రష్మిక గట్టిగా ఖండించిన సందర్భాలు లేవు. ఎఫైర్ రూమర్స్ చదువుతుంటే ఫన్నీగా ఉంటాయంటూ… నవ్వేస్తుంది. పరిణామాలు చూస్తుంటే వారు ఘాడ ప్రేమలో ఉన్న భావన కలుగుతుంది.

ఇక లక్ కలిసొచ్చి రష్మిక టాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదిగింది. వరుస విజయాలు ఆమెను తిరుగులేని హీరోయిన్ గా మార్చాయి. పుష్ప 2, యానిమల్ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్న రష్మిక కొత్తగా రైన్ బో టైటిల్ తో కొత్త మూవీ స్టార్ట్ చేశారు. నేటి నుండి రైన్ బో షూటింగ్ జరుపుకోనుంది. ఇది ఫాంటసీ లవ్ డ్రామాగా తెరకెక్కుతుంది. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల కానుంది. అలాగే నితిన్ కి జంటగా ఓ మూవీ ప్రకటించారు. వెంకీ కుడుముల ఈ చిత్ర దర్శకుడు.
Aiyoooo.. don’t over think it babu.. 🤣❤️
— Rashmika Mandanna (@iamRashmika) April 6, 2023