HIT 2 Collections: మేజర్ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అడవి శేష్ హీరో గా నటించిన ‘హిట్ 2 ‘ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది..థ్రిల్లర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అడవి శేష్, మరోసారి థ్రిల్లర్ జానర్ సినిమాతో అలరించేసాడు..టాక్ పాజిటివ్ గా రావడం తో ఈ సినిమాకి మొదటి రోజు కలెక్షన్స్ అన్ని ప్రాంతాలలో అదిరిపోయాయి..కానీ సీడెడ్ వంటి ప్రాంతాలలో కేవలం టౌన్స్ లో మినహా మిగిలిన సెంటర్స్ లో డీసెంట్ స్థాయి వసూళ్లే వచ్చాయి..ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాలలో కూడా క్రింద సెంటర్స్ లో A సెంటర్స్ రేంజ్ వసూళ్లు రాలేదు..ఫలితంగా అడవి శేష్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్ తెచ్చుకున్న సినిమాలలో ఒకటిగా అయితే నిలిచింది కానీ మీడియం రేంజ్ హీరోలలో రికార్డు స్థాయి కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది..వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయో ప్రాంతాల వారీగా ఇప్పుడు మనం ఈ విశ్లేషణ లో చూడబోతున్నాము.

ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజం 1.92 కోట్లు
సీడెడ్ 0.38 కోట్లు
ఉత్తరాంధ్ర 0.53 కోట్లు
ఈస్ట్ 0.29 కోట్లు
వెస్ట్ 0.19 కోట్లు
నెల్లూరు 0.15 కోట్లు
గుంటూరు 0.33 కోట్లు
కృష్ణ 0.24 కోట్లు
మొత్తం 4.03 కోట్లు
ఓవర్సీస్ 1.95 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.45 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 6.43 కోట్లు
అడవి శేష్ గత చిత్రం మేజర్ కి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి నాలుగు కోట్ల 7 లక్షల రూపాయిల షేర్ మొదటి రోజు వచ్చాయి..మేజర్ తో పోలిస్తే హిట్ 2 చిత్రానికి నాలుగు లక్షల రూపాయిలు తక్కువ వచ్చాయి..ఈ సినిమాకి నైజాం మరియు ఓవర్సీస్ ప్రాంతాలలో ఊహించినదానికంటే ఎక్కువ వసూళ్లే వచ్చాయి.

కానీ మాస్ ప్రాంతాలలో కాస్త తగ్గింది..అక్కడ ఇలాంటి జానర్ సినిమాలకు ఓపెనింగ్స్ తక్కువగా వస్తాయనే విషయం ముందుగా ఊహించిందే..ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 15 కోట్ల రూపాయలకు జరిగింది..వీకెండ్ లోపే బ్రేక్ ఈవెన్ అయితే తేలికగా అయిపోతుంది..సూపర్ హిట్ గా నిలుస్తుంది..కానీ ఫుల్ రన్ లో మేజర్ రేంజ్ వసూళ్లు వస్తాయా లేదా అనేది చూడాలి..రెండవ రోజు కలెక్షన్స్ మార్నింగ్ షోస్ చాలా బలంగా ప్రారంభమయ్యాయి..ఈరోజు కూడా నాలుగు కోట్ల షేర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.