https://oktelugu.com/

Adivi Sesh- Supriya: అక్కినేని హీరోయిన్ తో అడివి శేష్ ఎఫైర్… ఒకే కారులో, అడ్డంగా బుక్ అయ్యారుగా!

Adivi Sesh- Supriya: తనకంటే వయసులో పెద్దదైన మహిళతో అడివి శేష్ ఎఫైర్ నడుపుతున్నాడనేది టాలీవుడ్. మొదట్లో పుకారుగా ఉన్న ఈ న్యూస్ నిజమే అని తెలుస్తుంది. ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అడివి శేష్-సుప్రియ మధ్య సంథింగ్ సంథింగ్ అంటున్నారు. లెజెండ్ నాగేశ్వరరావుకు వరుసకు మనవరాలు అవుతుంది సుప్రియ. నాగార్జునకు మేనకోడలు. హీరో సుమంత్ సిస్టర్. ఈమెకు పెళ్ళై విడాకులు అయ్యాయి. భర్తతో విడిపోయాక ఒంటరిగా ఉంటున్నారు. మరో వివాహం చేసుకోలేదు. […]

Written By: , Updated On : March 30, 2023 / 12:38 PM IST
Follow us on

Adivi Sesh- Supriya

Adivi Sesh- Supriya

Adivi Sesh- Supriya: తనకంటే వయసులో పెద్దదైన మహిళతో అడివి శేష్ ఎఫైర్ నడుపుతున్నాడనేది టాలీవుడ్. మొదట్లో పుకారుగా ఉన్న ఈ న్యూస్ నిజమే అని తెలుస్తుంది. ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అడివి శేష్-సుప్రియ మధ్య సంథింగ్ సంథింగ్ అంటున్నారు. లెజెండ్ నాగేశ్వరరావుకు వరుసకు మనవరాలు అవుతుంది సుప్రియ. నాగార్జునకు మేనకోడలు. హీరో సుమంత్ సిస్టర్. ఈమెకు పెళ్ళై విడాకులు అయ్యాయి. భర్తతో విడిపోయాక ఒంటరిగా ఉంటున్నారు. మరో వివాహం చేసుకోలేదు.

1996లో విడుదలైన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో హీరోయిన్ అయ్యారు. ఆ చిత్రం పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ కావడం విశేషం. కారణం తెలియదు కానీ… మరలా హీరోయిన్ గా నటించలేదు. చాలా గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అడివి శేష్ హీరోగా విడుదలైన గూఢచారి మూవీలో కీలక రోల్ చేశారు. సుప్రియ నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు నిర్మించారు.

ఇదిలా ఉంటే కొన్నాళ్లుగా ఆమె అడివి శేష్ తో సన్నిహితంగా ఉంటున్నారు. అడివి శేష్-సుప్రియ రిలేషన్ లో ఉన్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై అడివి శేష్ స్పందించలేదు. అయితే తరచుగా కలిసి కనిపిస్తూ వార్తలకు ఎక్కుతున్నారు. అక్కినేని ఫ్యామిలీలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు అడివి శేష్ హాజరయ్యాడు. కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పాల్గొన్న వేడుకల్లో అవుట్ సైడర్ అడివి శేష్ కనిపించం ప్రాధాన్యత సంతరించుకుంది.

Adivi Sesh- Supriya

Adivi Sesh- Supriya

తాజాగా మరోసారి ఈ జంట వార్తలకు ఎక్కారు. మార్చి 27 రాత్రి చిరంజీవి ఇంట్లో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ బర్త్ డే పార్టీకి అడివి శేష్-సుప్రియ జంటగా హాజరయ్యారు. ఇద్దరూ ఒకే కారులో అక్కడకు చేరుకొని మీడియా కంటబడ్డారు. దీంతో వీరి ఎఫైర్ నిజమే అంటూ టాలీవుడ్ వర్గాలు నిర్ధారిస్తున్నాయి. ప్రస్తుతం సుప్రియ వయసు 45 ప్లస్. అదే సమయంలో అడివి శేష్ వయసు 37. బాలీవుడ్ లో మలైకా-అర్జున్ కపూర్ ఇదే తరహా ఎఫైర్ నడుపుతున్నారు. టాలీవుడ్ మలైకా-అర్జున్ కపూర్ లా అడివి శేష్-సుప్రియ అవతరించారు. మరోవైపు నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో ఎఫైర్ పెట్టుకున్నాడంటూ కథనాలు వెలువడుతున్నాయి.