Bigg Boss 6 Telugu- Adi Reddy: బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే ఈ ఆదివారం అట్టహాసం గా జరగబోతున్న సంగతి అందరికి తెలిసిందే..నిన్న మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య బయటకి వెళ్లగా, టాప్ 5 కంటెస్టెంట్స్ గా ఇప్పుడు శ్రీహాన్ , రేవంత్ , ఆది రెడ్డి , కీర్తి మరియి రోహిత్ నిలిచారు..వీళ్ళలో అందరికంటే అత్యధిక ఓట్లతో భారీ మార్జిన్ తో రేవంత్ టైటిల్ గెలుచుకోబోతున్నాడని తెలుస్తుంది.

ఇక అతనితో మొదటి రోజు నుండి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటూ వచ్చిన శ్రీహాన్ రన్నర్ గా నిలిచాడట..ఇక వీళ్ళతో పాటు టాప్ 3 స్థానం లో ఆది రెడ్డి నిలిచాడట..ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టి ఇంత దూరం రావడం అంటే మాటలు కాదు..కానీ ఆది రెడ్డి అసాధ్యం అనిపించినా ఈ టాస్కు ని అలవోకగా అధిగమించి తన ఆటతీరుతో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకొని టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచాడు ఆది రెడ్డి.
అయితే టాప్ 3 కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ప్రతీ సీజన్ లో 15 లక్షల రూపాయిలు ఆఫర్ ఇచ్చే విషయం అందరికి తెలిసిందే..సీజన్ 4 లో సోహైల్ ఈ ఆఫర్ కి ఒప్పుకొని బయటకి వచ్చేస్తాడు..అప్పట్లో సోహైల్ తీసుకున్న నిర్ణయం పెద్ద సంచలనం గా మారింది..ఈసారి కూడా టాప్ 3 కంటెస్టెంట్స్ గా నిలిచినా రేవంత్ , శ్రీహాన్ మరియు ఆది రెడ్డి కి బిగ్ బాస్ ఆ అద్భుతమైన గోల్డెన్ ఛాన్స్ ని ఇచ్చాడట.

అప్పుడు ఆది రెడ్డి బిగ్ బాస్ ఇచ్చిన ఆ ఆఫర్ ని అంగీకరించి 15 లక్షల రూపాయిలు గెలుచుకొని బయటకి వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఆది రెడ్డి కామన్ మ్యాన్ కాబట్టి అతనికి ఇచ్చే రెమ్యూనరేషన్ హౌస్ మేట్స్ అందరికంటే తక్కువే ఉంటుంది..తాను టైటిల్ గెలవడు అనే క్లారిటీ అయితే స్పష్టంగా ఆదిరెడ్డి కి క్లారిటీ ఉంది..అందుకే బిగ్ బాస్ ఇచ్చిన ఆ ఆఫర్ ని అంగీకరించి ఆది రెడ్డి చాలా తెలివైన పని చేశాడంటూ విశ్లేషకులు చెప్తున్నారు.