Bigg Boss 6 Telugu Title Winner: 21 మంది కంటెస్టెంట్స్ తో ఘనంగా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు ఇప్పుడు గ్రాండ్ ఫినాలే కి ఒక్క అడుగు దూరం లో ఉన్నది..నిన్న మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా శ్రీ సత్య ఎలిమినేట్ అయిపోవడం తో ఇప్పుడు హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ గా రేవంత్ , రోహిత్, శ్రీహాన్ , కీర్తి మరియు ఆది రెడ్డి మిగిలారు..అయితే వీళ్ళలో రేవంత్ కి అందరికంటే అత్యధిక ఓట్లు రావడం తో అతనే టైటిల్ విన్నర్ గా నిలిచాడని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

తర్వాత రన్నర్ గా రేవంత్ బెస్ట్ ఫ్రెండ్ శ్రీహాన్ నిలిచాడట..ఇద్దరు కూడా టైటిల్ గెలుచుకోవడానికి అర్హులే..ఇద్దరిలో ఎవరికీ టైటిల్ వచ్చినా సంతోషమే అని ఆడియన్స్ సోషల్ మీడియా లో చెప్తున్నారు..టైటిల్ గెలుచుకున్న కంటెస్టెంట్ కి బిగ్ బాస్ వరాల జల్లు కురిపించిన సంగతి తెల్సిందే..50 లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటుగా 25 లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు మరియు కారు కూడా విన్నర్ కి లభిస్తుంది.
ఇక టాప్ 3 గా ఎవరు నిలుస్తారు అనేది రోహిత్ మరియు ఆది రెడ్డి మధ్య ఉండబోతుంది..వీళ్లిద్దరి మధ్య ఓట్ల తేడా కూడా చాలా స్వల్పం గా ఉన్నట్టు సమాచారం..ఇక కీర్తి చివరి ఐదవ స్థానమే అని నిర్ధారణ అయ్యింది..మరో పక్క రేవంత్ టైటిల్ గెలుచుకున్నాడు అనే వార్త బయటకి రావడం తో నెటిజెన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు..ఎందుకంటే మిగిలిన కంటెస్టెంట్స్ ఎలా ఉన్నా రేవంత్ మొదటి రోజు నుండి నిన్నటివరకు టాస్కులను సీరియస్ గా తీసుకొని ఆడుకుంటూ వచ్చాడు.

తనకి స్కోప్ లేకపోయినా తన బెస్ట్ ఇవ్వడానికి నూటికి నూరు శాతం కృషి చేసాడు..అందుకే ఈరోజు ఆయనకీ టైటిల్ గెలుచుకునే అవకాశం దక్కింది..ఇక శ్రీహాన్ కూడా అంతే..మొదటి రెండు వారాలు తన ఆట పెద్దగా కనిపించకపోయినా ఆ తర్వాత నుండి టాస్కులు ఆడడం లో కానీ..ఎంటర్టైన్మెంట్ పంచడం లో కానీ తన బెస్ట్ ఇచ్చాడు..ఈ ఇద్దరి స్నేహితులు ఇప్పుడు టాప్ 1 మరియు టాప్ 2 గా నిలవడం అందరికీ సంతృప్తిని ఇచ్చింది.