https://oktelugu.com/

Adah Sharma: నా దున్నపోతుతో నేను… పెళ్లి కాని బన్నీ హీరోయిన్ చేసిన పనికి విస్తుపోతున్న జనాలు!

Adah Sharma: నార్త్ బ్యూటీ ఆదా శర్మ చర్యలు కొంచెం భిన్నంగా ఉంటాయి. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ ఆసక్తిని రేపుతుంటాయి. కత్తిసాము, కర్రసాము, జిమ్నాస్టిక్స్ చేస్తూ వీడియోలు చేస్తుంది. రకరకాల విచిత్ర వేషధారణలలో కనిపిస్తుంది. తాజాగా ఆదా శర్మ పోస్ట్ చేసిన ఫోటో నెటిజెన్స్ ని ఆకర్షించింది. విషు పండగ శుభాకాంక్షలు వెరైటీగా చెప్పింది. విషు పండగను ప్రతి ఏడాది కేరళలో నిర్వహిస్తారు. తెలుగు వాళ్లకు ఉగాది మాదిరి విషు కేరళ సంవత్సరాది. విషు పండుగ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 15, 2023 / 01:55 PM IST
    Follow us on

    Adah Sharma

    Adah Sharma: నార్త్ బ్యూటీ ఆదా శర్మ చర్యలు కొంచెం భిన్నంగా ఉంటాయి. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ ఆసక్తిని రేపుతుంటాయి. కత్తిసాము, కర్రసాము, జిమ్నాస్టిక్స్ చేస్తూ వీడియోలు చేస్తుంది. రకరకాల విచిత్ర వేషధారణలలో కనిపిస్తుంది. తాజాగా ఆదా శర్మ పోస్ట్ చేసిన ఫోటో నెటిజెన్స్ ని ఆకర్షించింది. విషు పండగ శుభాకాంక్షలు వెరైటీగా చెప్పింది. విషు పండగను ప్రతి ఏడాది కేరళలో నిర్వహిస్తారు. తెలుగు వాళ్లకు ఉగాది మాదిరి విషు కేరళ సంవత్సరాది. విషు పండుగ కోసం ఆదా శర్మ కేరళ కట్టుబొట్టులో తయారైంది. పండుగ శుభాకాంక్షలు మాత్రం కొంచెం వెరైటీగా చెప్పింది.

    దున్నపోతుతో ఫోటో దిగిన ఆదా శర్మ.. హ్యాపీ విషు, నా తరపున అలాగే మీనాక్షి(దున్నపోతు) తరపున, అని కామెంట్ పెట్టింది. తన ఫార్మ్ లో ఉన్న దున్నపోతు పేరు మీనాక్షి అట. దాంతో పాటు పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఇక ఆదా శర్మ పోస్ట్ పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.

    దర్శకుడు పూరి జగన్నాధ్ ఆదా శర్మను టాలీవుడ్ కి పరిచయం చేశాడు. నితిన్ కి జంటగా హార్ట్ అటాక్ మూవీలో ఆదా శర్మ నటించారు. ఈ మూవీ విజయం సాధించలేదు. దాంతో ఆమె ఫేమ్ సపోర్టింగ్ రోల్స్ కి పడిపోయింది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర చేసింది. అల్లు అర్జున్ సినిమా అని పేరేగానీ ఇద్దరికీ ఎలాంటి సీన్స్ ఉండవు . కనీసం ఒక పాట కూడా లేదు.

    Adah Sharma

    సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఫలితం మాత్రం దక్కలేదు. క్షణం మూవీతో ఆదా శర్మ మెప్పించారు. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సూపర్ హిట్ గా నిలిచింది. తర్వాత కల్కి చిత్రంలో రాజశేఖర్ కి జంటగా నటించారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన కల్కి పర్లేదు అనిపించుకుంది. కమర్షియల్ గా ఆడలేదు. మీట్ క్యూట్ టైటిల్ తో విడుదలైన వెబ్ మూవీలో నటించారు. ఆమె లేటెస్ట్ మూవీ సెల్ఫీ అట్టర్ ప్లాప్. అక్షయ్ కుమార్ హీరోగా నటించారు. ప్రస్తుతం ది కేరళ స్టోరీ టైటిల్ తో ఓ మూవీ చేస్తుంది.