
Vidudala Part 1 Review: నటీనటులు :
విజయ్ సేతుపతి, సూరి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, భవాని శ్రీ
డైరెక్టర్ : వెట్రిమారన్
సంగీతం : ఇళయరాజా
నిర్మాతలు : అల్లు అరవింద్
విలక్షణమైన పాత్రలకు పెట్టింది పేరు లాంటి వాడు విజయ్ సేతుపతి.కేవలం హీరో రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా,అన్నీ రకాల పాత్రలు పోషిస్తూ పాన్ ఇండియన్ స్టార్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.ఇక తమిళనాట ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తీసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న దర్శకుడు వెట్రిమారన్.వీళ్లిద్దరి కాంబినేషన్ లో రీసెంట్ గా విడుదలైన ‘విడుదల’ అనే చిత్రం తమిళనాట సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.దీనితో ఈ సినిమా తెలుగు వెర్షన్ ని ఫ్యాన్సీ రేట్ తో నిర్మాత అల్లు అరవింద్ కొనుగోలు చేసి నేడు గ్రాండ్ గా విడుదల చేసాడు.ఈ చిత్రం లో విజయ్ సేతుపతి తో పాటు, తమిళ కమెడియన్ సూరి కూడా హీరోగా నటించాడు.ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాకి ఆయనే మెయిన్ హీరో, మరి తమిళనాట భారీ విజయం సాధించిన ఈ సినిమా మన తెలుగు ఆడియన్స్ కి నచ్చిందో లేదో ఇప్పుడు చూద్దాము.
కథ :
పోలీస్ ఉద్యోగులలో కూడా నిజాయితీగా మిగిలి ఉంది అని చెప్పడానికి ప్రతీకగా నిలిచే మనిషి కుమరేషన్ (సూరి).పోలీస్ స్టేషన్ లో ఒక సాధారణ డ్రైవర్ గా పనిచేసే అతనికి ఓ వివాదాస్పద ప్రాంతానికి ట్రాన్స్ఫర్ వస్తుంది.అక్కడ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ కార్యకలాపాలను ఎదురుకుంటూ ‘ప్రజాదళం’ ఉంటుంది.దీనికి అధినేత పెరుమాళ్(విజయ్ సేతుపతి).ప్రజాదళం తమ ప్రాంతం లో జరుగుతున్న గనుల తవ్వకాన్ని నిరసిస్తూ బాంబుల ద్వారా రైళ్లను పేల్చివేస్తుంది.ఈ క్రమం లో ఎట్టిపరిస్థితిలో అయినా ప్రజాదళం అధినేత పెరుమాళ్ ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉంటారు.’ఆపరేషన్ ఘోస్ట్ హంట్’ పేరిట స్పెషల్ ఆఫీసర్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) ఆద్వర్యం లో రాత్రియంబవళ్ళు పెరుమాళ్ కోసం వెతుకుతూ ఉంటారు పోలీసులు.ఇక అక్కడ డ్రైవర్ గా పనిచేస్తున్న కుమరేషన్ పోలీసులకు క్యారేజీలు మరియు వాళ్ళ వ్యక్తిగత పనులను చేస్తూ ఉంటాడు.అయితే ఈలోపు పెరుమాళ్ ఆచూకీ ని కనిపెట్టడం కోసం కొండప్రాంతం లో నివసిస్తున్న మహిళలను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీసులు చిత్రహింసలు పెడుతుంటారు.వారిలో కుమరేషన్ ప్రేమించే అమ్మాయి కూడా ఉంటుంది.వీళ్ళ బాధని చూడలేక కుమరేషన్ పోలీసులతో పెరుమాళ్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు, నాతో పాటు వస్తే చూపిస్తాను అంటాడు.అలా పెరుమాళ్ కోసం వెళ్లిన స్పెషల్ టీం చివరికి అతనిని పట్టుకొని అరెస్ట్ చేసిందా లేదా అనేది స్టోరీ.
విశ్లేషణ :
తమిళనాట పాపులర్ రచయితగా పేరు గడించిన బి. జయ మోహన్ రాసిన ‘తునైవన్’ అనే చిన్న కథని ఆధారంగా తీసుకొని వెట్రిమారన్ అల్లిన కథ ఇది.సినిమా ప్రారంభానికి ముందే రెండు భాగాలుగా తియ్యాలనుకున్నాడు.ఒక చిన్న కథని డెవలప్ చేసి రెండు భాగాలుగా తియ్యాలనుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు, చాలా కష్టం తో కూడుకున్న వ్యవహారం.కానీ వెట్రిమారన్ స్టోరీ టెల్లింగ్ కల్ట్ క్లాసిక్ గా ఉంటుంది.సినిమా అప్పుడే అయిపోయిందా, ఇంకా కాసేపు ఉంటే బాగుండును అని అనిపించే విధంగా ఉంటాయి ఆయన సినిమాలు.ఈరోజు రిలీజ్ అయినా ‘విడుదల’ అనే చిత్రం కూడా అలాంటిదే.అద్భుతమైన స్టోరీ టెల్లింగ్ తో ఆడియన్స్ ని కథలో ప్రయాణించే విధంగా తీసాడు.

ఇక నటీనటుల విషయానికి వస్తే విజయ్ సేతుపతి మరోసారి తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచాడు.అయితే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాలో తక్కువ ఉండడం వల్ల ఆడియన్స్ కాస్త నిరాశకి గురయ్యే అవకాశం ఉంది.ఎందుకంటే విజయ్ సేతుపతి కోసమే మన తెలుగు ఆడియన్స్ సినిమాకి కదులుతారు.ఆయన ఎప్పుడొస్తాడు తెరపైకి అని ఆతృతగా ఎదురు చూసే క్రమం లో, ఆడియన్స్ సినిమా కథలో ఇన్వాల్ అవ్వడం తగ్గించేస్తారు.ఇక తమిళనాట పాపులర్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సూరి, సీరియస్ పాత్రలో హీరోగా ఇంత బాగా నటిస్తాడని మాత్రం ఎవ్వరు ఊహించలేరు.బాధ్యతకు మరియు హక్కులకు మధ్య జరిగే ఈ పోరాటం ఆడియన్స్ కి బాగా నచుతుంది.
చివరి మాట: ఈ వీకెండ్ విడుదలైన సినిమాలలో ‘ది బెస్ట్’ అని చెప్పొచ్చు.తప్పకుండ ఒకసారి అందరూ చూడాల్సిన సినిమా.
రేటింగ్ : 2.75/5