
Actress Shakeela: మలయాళ చిత్ర పరిశ్రమలో షకీలా ఓ సెన్సేషన్. ఏడాదికి ఇరవైకి పైగా చిత్రాలు విడుదల చేసిన హిస్టరీ ఆమెది. మాలీవుడ్ లో ఆమె క్రేజ్ గురించి మాటల్లో చెప్పలేం. మోహన్ లాల్, మమ్ముట్టి వంటి టాప్ స్టార్స్ కూడా షకీలా మూవీ రిలీజ్ ఉంటే భయపడేవారట. వాయిదా వేసుకునేవారట. అడల్ట్ కంటెంట్ చిత్రాలకు షకీలా బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. తర్వాత ఆమె కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. వందకు పైగా చిత్రాల్లో షకీలా నటించారు.
ప్రస్తుతం వెండితెర మీద ఆమె హవా తగ్గింది. షకీలాకు పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఒకప్పుడు గొప్ప వెలుగు వెలిగిన షకీలాకి బ్యాడ్ టైం నడుస్తుంది. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం కొబ్బరి మట్ట. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించాడు. కత్తి మహేష్ వైఫ్ పాత్రలో షకీలా నటించడం విశేషం.
ఇదిలా ఉంటే షకీలా ఓ అపార్ట్మెంట్ వాసుల కోసం పోరాటం చేస్తున్నారు. చెన్నైలోని చూలైమేడు ఏరియాలో గల చిత్ర రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నారు. ఆ అపార్ట్మెంట్ యాజమాన్యం వారి నుండి పెద్ద మొత్తంలో మైంటెనెన్సు చార్జీలు వసూలు చేస్తున్నారట. ఏకంగా రూ. 9 వేలు కట్టమంటున్నారట. ఆ డబ్బులు చెల్లించడానికి నిరాకరించడంతో యాజమాన్యం నీటి సరఫరా ఆపివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారట.

మూడు రోజులుగా నీళ్లు లేక చిత్ర రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారట. దీంతో వారందరూ యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. దీని గురించి తెలుసుకున్న షకీలా వారి తరపున ఉద్యమంలో పాల్గొన్నారట. అపార్ట్మెంట్ వాసుల నిరసన జనాలకు తెలిసేలా చేశారట. షకీలా కారణంగా ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా షకీలా పేదల కోసం తన గళం విప్పారని పలువురు ఆమెను కొనియాడుతున్నారు.
షకీలా బిగ్ బాస్ కన్నడ సీజన్ 2లో పాల్గొన్నారు. ఆమె నాలుగు వారాలకే ఎలిమినేట్ అయ్యారు. ఇకపై అడల్ట్ కంటెంట్ మూవీస్ చేయనని ఆమె వెల్లడించారు. ‘షకీలా: ఆత్మకథ’ పేరుతో 2013లో ఆటోబయోగ్రఫీ షకీలా విడుదల చేసింది.