
Actress Prema- Soundarya: ఈ తరం సావిత్రిగా కీర్తించబడింది సౌందర్య. సావిత్రి, విజయశాంతి తర్వాత హీరోలకు సమానమైన స్టార్డమ్ అనుభవించిన ఏకైన హీరోయిన్ సౌందర్య. చిత్ర పరిశ్రమలో సౌందర్య ప్రస్థానం కేవలం పదేళ్లే. కానీ తరాలు గుర్తుండిపోయే పాత్రలు చేశారు. కన్నడ అమ్మాయి అయిన సౌందర్యను తెలుగు పరిశ్రమ అక్కున చేర్చుకుంది. ఇతర భాషల్లో చిత్రాలు చేసినప్పటికీ తెలుగు హీరోయిన్ గా స్థిరపడ్డారు. అత్యధికంగా టాలీవుడ్ చిత్రాల్లో నటించారు. అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు.
సౌందర్య నటిస్తున్నారంటే సినిమాలో హీరోయిన్ పాత్రకు వెయిట్ ఉందని చెప్పొచ్చు. కమర్షియల్ చిత్రాల్లో కూడా తన మార్క్ చూపించారు. అనతికాలంలో ఎదిగిన సౌందర్య అంతే వేగంగా కనుమరుగయ్యారు. ఆమె కీర్తిని చూసి కన్ను కుట్టిన భగవంతుడు జీవితాన్ని అకాలంగా ముగించారు. 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో సౌందర్య మరణించారు. ఆమెతో పాటు తమ్ముడు కూడా అదే విమానంలో ఉన్నారు.
అనూహ్యంగా సౌందర్య తల్లిదండ్రులకు ఇద్దరు బిడ్డలు దూరమయ్యారు. సౌందర్య మరణంపై దిగ్భ్రాంతి కలిగించే విషయాలు నటి ప్రేమ వెల్లడించారు. ప్రేమ లేటెస్ట్ ఇంటర్వ్యూలో సౌందర్యను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. సౌందర్య మరణ వార్త వేదనకు గురి చేసింది. చివరి చూపు చూసేందుకు ఆమె నివాసానికి వెళ్ళాను. సౌందర్య, ఆమె తమ్ముడు డెడ్ బాడీస్ బాక్సులలో పెట్టి ఉంచారు. సౌందర్య బాడీకి తల లేదు. కనీసం చివరి చూపు చూడలేకపోయానని ప్రేమ అన్నారు.

సౌందర్య ఎప్పుడూ అందంగా ఉండాలనుకునేవారు. షూటింగ్ లో షాట్స్ గ్యాప్ లో కూడా టచప్ చేసుకుంటూ లుక్ పర్ఫెక్ట్ గా ఉండాలని ఆశపడేవారు. అందం గురించి అంతగా ఆలోచించే సౌందర్యకు ప్రమాదంలో తల లేకుండా పోయింది. సౌందర్య మరణించాక నాకు జీవితం అంటే ఇంతే అనిపించింది. మనతో ఏమీ రాదు… కర్మ, కీర్తి మాత్రమే అని అర్థమైందని ప్రేమ వెల్లడించారు. కేవలం చేతికి ఉన్న వాచ్ ఆధారంగా అది సౌందర్య మృతదేహం అని గుర్తించినట్లు ప్రేమ చెప్పుకొచ్చారు.