
Case Against Dog: పాపం ఆ కుక్కకు పెద్ద కష్టం వచ్చిపడింది. తెలిసో తెలియకో చేసిన పాపానికి పోలీస్ స్టేషన్ కు చేరాల్సి వచ్చింది. ఇంతకీ అది చేసిన పెద్ద తప్పెంటో తెలుసా. ఏపీ ముఖ్యమంత్రి జగనన్న పేరిట ఆ పార్టీ నాయకులు అంటించుకుంటూ వెళ్తున్న స్టిక్కర్ ను నోటితో తీసిపారేయడమే. దీనిపై తెలుగుదేశం పార్టీ తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. కొద్దిసేపటికే వైరల్ మారిపోవడం ప్రస్తుతం ఆ కుక్క టాపిక్ హాట్ హాట్ గా మారిపోయింది.
వైసీపీ నేతలు నిత్యం ప్రజల్లో ఉండాలని ‘‘మా నమ్మకం నువ్వే జగన్’’, ‘‘జగనన్నే మా భవిష్యత్తు’’ వంటి కార్యక్రమాలను రూపొందించింది. జగన్ ఆదేశాల మేరకు ప్రతి ఊరిలోని నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేస్తునన ‘‘మంచి’’ని ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఇంటికి జగన్ ఫొటోతో ఉన్న స్టిక్కర్లను అంటిస్తున్నారు. కొన్నిచోట్ల పార్టీ కార్యకర్తల అత్యుత్సాహంతో గోడలకు, స్తంభాలకు కూడా ఆ స్టిక్కర్లను వేసేస్తున్నారు. ఇళ్లకు వేసినవి అందే అవకాశం ఉండదు. నిత్యం రద్దీగా ఉండే ఓ ప్రాంతంలో ఓ గోడ కింది భాగంలో ఉన్న స్టిక్కురు ఓ కుక్కకు అందింది. అంతే దానిని కసి కసిగా కొరికి పీకి పారేసింది.
కుక్క పీకేస్తున్న వీడియో అక్కడున్న కొంతమంది చిత్రీకరించారు. అది టీడీపీ నేతల వరకు చేరడంతో తమ అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ‘‘ఇప్పుడు దాని మీద కూడా కేసు వేస్తారా’’ అని ట్యాగ్ తగిలించారు. కొద్దిసేపటికే వైరల్ గా మారిపోయింది. కాగా, అనుకున్నదే అయ్యింది. విజయవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆ కుక్కపై మహిళలు ఫిర్యాదు చేశారు. కుక్క స్టిక్కర్ పీకేస్తున్న వీడియోను ఆధారంగా చేసుకొని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

వైసీపీ అధికారం చేపట్టి నాలుగేళ్లవుతుంది. అది కూడా 151 సీట్లతో అఖండ మెజార్టీతో గెలుపొందింది. రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది కార్యకర్తల మనోభావాలను కించపరిచిందని సదరు మహిళలు పేర్కొన్నారు. కుక్క చేసిన పనితో దిగ్బ్రాంతికి గురైనట్లు చెప్పుకొచ్చారు. ఏపీలో ప్రతిపక్షాలను వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత వేధింపులకు రకరకాలుగా గురిచేస్తుంది. పార్టీ నేతలపై పల్లెత్తు మాట అనినా, పోలీసుల సాయంతో అరెస్టులు, సీబీఐ కేసుల వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సదరు కుక్క కూడా ప్రతిపక్ష పార్టీకే చెందిందని చర్యలు ఏం తీసుకుంటారోనన్న ఆసక్తి మొదలైంది. పోలీసులు మాత్రం అరెస్టు చేయాలా వద్దా అని తలలు పట్టుకుంటున్నారు.
View this post on Instagram