https://oktelugu.com/

Anushka Shetty: అనుష్క చేసిన ఆ పొరపాటే జీవితాంతం వెంటాడుతోందా!

Anushka Shetty: అనుష్క సినిమా చేస్తోందా ? లేదంటే సినిమాలకు స్వస్తి చెప్పి పెళ్లి చేసుకోబోతోందా ? అని పలు రకాలు డౌట్లు నెటిజన్లు గత కొన్ని నెలలుగా వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అనుష్క ‘నిశ్శబ్ధం’ తర్వాత ఓ కొత్త సినిమా ఒప్పుకుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ‘రారా కృష్ణయ్య’ అనే సినిమాని తీసిన పి.మహేశ్‌ అనే దర్శకుడు రాసిన ఓ కథ అనుష్కకు చాల బాగా నచ్చిందని, అందుకే ఆ సినిమా చేయడానికి […]

Written By:
  • admin
  • , Updated On : June 3, 2022 / 08:58 AM IST
    Follow us on

    Anushka Shetty: అనుష్క సినిమా చేస్తోందా ? లేదంటే సినిమాలకు స్వస్తి చెప్పి పెళ్లి చేసుకోబోతోందా ? అని పలు రకాలు డౌట్లు నెటిజన్లు గత కొన్ని నెలలుగా వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అనుష్క ‘నిశ్శబ్ధం’ తర్వాత ఓ కొత్త సినిమా ఒప్పుకుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ‘రారా కృష్ణయ్య’ అనే సినిమాని తీసిన పి.మహేశ్‌ అనే దర్శకుడు రాసిన ఓ కథ అనుష్కకు చాల బాగా నచ్చిందని, అందుకే ఆ సినిమా చేయడానికి ఆమె అంగీకరించందని ఇండస్ట్రీలో టాక్ నడిచింది.

    పైగా అనుష్క చేస్తోన్న ఈ సినిమాలో ‘జాతిరత్నాలు’ హీరో నవీన్‌ పొలిశెట్టి హీరో అని, కథ కాస్త బోల్డ్ గా ఉండబోతుందని టాక్. ఓ నలభై ఏళ్ల పెళ్లి కాని అమ్మాయి, పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్న ఓ పాతికేళ్ల అబ్బాయితో ప్రేమలో పడితే.. వయసు వల్ల వారి జీవితాలు అనే సమస్యల్లో ఇరుక్కుంటే ? అసలు ప్రేమకు వయసుతో పనేంటి ? అనే కోణంలో కథ నడిస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌ తో ఈ సినిమా రానుంది.

    ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ కూడా ఈ సినిమా కోసం అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా కోసం అనుష్క మళ్ళీ కాస్త లావు పెరిగింది. నలభై ఏళ్ల అమ్మాయి అంటే కాస్త లావుగా ఉంటనే బాగుంటుందని దర్శకుడు కోరగానే, అనుష్క కూడా సినిమా కోసం లావు పెరిగింది. ప్రస్తుతం అనుష్క ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతుండే సరికి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.

    లావుగా కనిపిస్తోన్న ‘అనుష్క’ ఫొటోలను చూసి.. కొందరియు నెటిజన్లు కామెంట్లు చేస్తూ ‘భలేగున్నావ్‌, తెగ ముద్దొస్తున్నావ్‌.. బుగ్గలు బర్గర్‌ లా ఉన్నాయ్‌.. దిష్టి తీయించుకో.. చబ్బీ గర్ల్‌..’ అంటూ పోస్ట్ లు చేస్తున్నారు. అయితే, లావుగా కనిపిస్తోన్న ఈ ఫోటో ‘సైజ్‌ జీరో’ సినిమా సమయంలో దిగిన ఫోటో అయి ఉండొచ్చు అంటూ మరి కొంతమంది అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఒకటి మాత్రం క్లారిటీ ఏమిటంటే.. అనుష్క తన కొత్త సినిమా కోసం మళ్ళీ లావు పెరుగుతుందట.

    ‘సైజ్ జీరో’ సినిమా కోసం భారీగా లావు అయ్యింది అనుష్క శెట్టి. ఈ సినిమా చేయకపోతే అనుష్క భవిష్యత్ వేరుగా ఉండేది. ఆ సినిమా కోసం లావుగా మారి ఇప్పటికీ ఆ లావును తగ్గించుకోలేక అనుష్క ఆపసోపాలు పడుతోంది. ఆ రిస్క్ చేయడం వల్ల అనుష్క ఫిజిక్ లో వచ్చిన మార్పులు అసలుకే మోసమొచ్చేలా చేసింది. మళ్లీ సాధారణ స్థితికి రాలేకపోతోంది. దీంతో అనుష్క మూవీ కెరీర్ డ్యామేజ్ అయ్యింది. సినిమా చాన్సులు అడుగంటాయి. అనుష్క ఈ సినిమా కోసమే చేసిన పొరపాటే ఆమె పాలిట గ్రహపాటుగా మారింది.