Kashmir killings: ఇటీవల కాలంలో ది కశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది. అందులో ఉన్న విధంగా కశ్మీర్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. వారి ప్రాణాలు తీస్తున్నారు. దీంతో వారు తమ ప్రాంతాన్ని వీడి వలస వెళ్తున్నారు. బతుకుమీద ఆశతో ఎక్కడికైనా వెళ్లి తలదాచుకుంటామని చెబుతున్నారు. ప్రభుత్వం భద్రత చర్యలు తీసుకుంటున్నా ఉగ్రవాదులు సామాన్యుల ప్రాణాలే లక్ష్యంగా చేసుకుంటున్నారు ఫలితంగా వారిలో భయం వెంటాడుతోంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా హత్యలు ఆగకపోవడంతో వారు తమను కాపాడుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నారు.

కశ్మీర్ లో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. హిందువులే లక్ష్యంగా చేసుకుని ప్రాణాలు తీస్తున్నారు. దీంతో వారు బిక్కుబిక్కుమంటూ జీవనం గడపాల్సి వస్తోంది. తమ ప్రాణాలకు భద్రత లేదని వాపోతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ప్రజల ప్రాణాలను తీసేస్తున్నారు. దీంతో చేయని తప్పుకు ఫలితం అనుభవిస్తున్నారు. తమకు భద్రత లేదా అని కశ్మీరీ పండిట్లు ఆందోళన చెందుతున్నారు. దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతున్నా ఆచరణలో కనిపించడం లేదనే వాదనలు కూడా వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం తీసుకునే చర్యలపై వారి భవిష్యత్ ఆధారపడి ఉంది.
Also Read: BJP vs KCR: కేసీఆర్ తో ఫైట్.. తెలంగాణ బీజేపీ నేతలకు సంచలన ఆదేశాలు
కశ్మీర్ లో హింసాకాండకు అంతు లేకుండా పోతోంది. అమాయకుల ప్రాణాలు తీస్తూ ఉగ్రవాదులు పిరికిపందల్లా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి భద్రత డొల్లగానే మారుతోంది. గతంలో ప్రభుత్వ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగిని హతమార్చారు. తరువాత ఓ పాఠశాల ఉపాధ్యాయుడిని పొట్టన పెట్టుకున్నారు. దీంతో పండిట్లలో భయం పెరుగుతోంది. తమ ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నిస్తున్నారు. తాము చేసిన పాపమేమిటి? తమను ఎందుకు లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం అక్కడ భద్రత పెంచినా హింసా కాండ ఆగడం లేదు.

దీనిపై కశ్మీర్ గవర్నర్ పండిట్లకు భద్రత పెంచుతామని వారి ప్రాణాలు పోకుండా చూస్తామని చెబుతున్నారు. దీంతో లోయలో పండిట్ల బతుకు భారంగా మారుతోంది. రోజురోజుకు భయాందోళనలు పెరుగుతున్నాయి. తీవ్రవాదులు ఎక్కడ చంపుతారోనని దినదిన గండం నూరేళ్ల ఆయుష్షులాగా కాలం వెళ్లదీస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా పటిష్ట చర్యలు తీసుకుని వారి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తిస్తే మంచింది. కానీ వారిలో ఆందోళన మాత్రం ఎక్కువవుతోంది. ఇలా హత్యలు జరిగితే మాత్రం భయం ఉండదా.
శ్రీనగర్ లో ఒక ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఉద్యోగులు ఉండే ప్రాంతాల్లో భద్రత పెంచారు. కానీ కొన్ని కుటుంబాలు మాత్రం ఆ ప్రాంతాన్ని వీడుతున్నాయ. వలస వెళ్తున్నారు. తమకు బతుకు ముఖ్యమని ఇలా ఉగ్రవాదులకు బలైపోవడం ఇష్టం లేదని చెబుతున్నారు. వారి అభ్యర్థనపై ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదు. దీంతో వారి మనుగడ ప్రశ్నార్థకమేనా? ప్రభుత్వం చర్యలు తీసుకుని వారికి భరోసా ఇస్తుందా? వేచి చూడాల్సిందే.
Also Read:CM KCR- Telangana Formation Day: ఓవైపు డబ్బుల కటకట.. మరోవైపు కేసీఆర్ పొగడ్తల వర్షం

