
Actor Madhavan: దశాబ్దానికో గొప్ప చిత్రం వస్తుందంటారు. 2009లో విడుదలైన 3 ఇడియట్స్ అలాంటిదే. ఒక డిఫరెంట్ టైటిల్ తో ఆకర్షించిన దర్శకుడు గొప్ప కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించారు. దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి చిత్రాలు ఎప్పుడూ ప్రత్యేకమే. వాటిలో 3 ఇడియట్స్ ది అగ్రస్థానం అని చెప్పవచ్చు. ఎడ్యుకేషన్ సిస్టమ్, కెరీర్ సెలక్షన్ వంటి సామాజిక అంశాలపై తెరకెక్కిన ఈ సెటైరికల్ డ్రామా సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతం చేసింది. 3 ఇడియట్స్ గా నటించిన అమీర్ ఖాన్, ఆర్ మాధవన్, శర్మన్ జోషి అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు.
ప్రముఖ రైటర్ చేతన్ భగత్ రాసిన ఫైవ్ పాయింట్ సమ్ వన్ నావెల్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఒక మిత్రుడిని వెతికే జర్నీలో తమ లైఫ్ జర్నీ చెప్పడం గొప్ప స్క్రీన్ ప్లేకి నిదర్శనం. సీరియస్ సోషల్ మెసేజ్ కి హ్యూమర్,రొమాన్స్ జోడించి యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. కరీనా కపూర్ హీరోయిన్ గా నటించగా… బోమన్ ఇరానీ పాత్ర, ఆయన నటన నభూతో నభవిష్యతి.
3 ఇడియట్స్ మూవీలో తన ఆసక్తికి వ్యతిరేకంగా ఇంజనీరింగ్ చదివే కుర్రాడి పాత్ర చేశాడు ఆర్ మాధవన్. అతనికి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే ప్రాణం. తన చుట్టూ ఉన్న వాళ్ళను చూసి పేరెంట్స్ తనని కూడా ఇంజనీర్ చేయాలనుకుంటారు. ఫర్హాన్ (మాధవన్) మనసంతా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ మీదే ఉంటుంది. చదువు అసలు బుర్రకెక్కదు. ఫర్హాన్ గా మాధవన్ పరకాయ ప్రవేశం చేశాడు. సినిమా మొత్తం అతని పాయింట్ ఆఫ్ వ్యూలోనే దర్శకుడు నేరేట్ చేశాడు.
కాగా ఫర్హాన్ పాత్ర కోసం ఆర్ మాధవన్ ఆడిషన్ చేశాడట. మేకర్స్ ఆయన్ని ఓ సన్నివేశానికి ఆడిషన్ చేసి తర్వాత ఎంపిక చేశారట. 3 ఇడియట్స్ మూవీలో ఫర్హాన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవుతానని తన తండ్రిని ఒప్పించే పాత్ర చాలా భావోద్వేగంగా సాగుతుంది. సంఘర్షణ తో కూడుకొని ఉంటుంది. ఆ సీన్ ఆడిషన్ లో చేసి చుపించామన్నారట. మాధవన్ ఆడిషన్ చేసిన ఆ వీడియోని విధు వినోద్ చోప్రా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.

అది పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. మాధవన్ బ్రిలియంట్ యాక్టర్. ఆయన గ్రేట్ ఆర్టిస్ట్. 3 ఇడియట్స్ మూవీలో ఫర్హాన్ పాత్ర మాధవన్ కంటే బెటర్ గా మరొకరు చేయలేరంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోకి లక్షల వ్యూస్ దక్కాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… అప్పటికే మాధవన్ స్టార్. పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. అలాంటి మాధవన్ సెకండ్ హీరో రోల్ కోసం ఆడిషన్ ఇవ్వడం గొప్ప పరిణామం. అతని నిబద్ధతకు నిదర్శనం.