Acharya Manchu Laxmi: ఆచార్య సినిమా ఫెయిలయిందనేనా..?: మంచు లక్ష్మి డ్యాన్స్ వీడియోపై ట్రోలింగ్

Acharya Manchu Laxmi: మంచువారి ఆడపడుచు మరోసారి వార్తల్లోకెక్కింది. మోహన్ బాబు కూతురు అయిన మంచు లక్ష్హి సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా లక్ష్మి బుల్లెట్టు బండెక్కి వస్తా.. సాంగ్ కు డ్యాన్స్ చేసి ఇరగదీసింది. ఇక్కడ ఆమెతో పాటు తన ఆరేళ్ల కూతురు కూడా నృత్యంలో పాలుపంచుకుంది. సాధారణంగా సినిమా నటులు ఇలా డ్యాన్స్ చేయడం పెద్ద విషయం కాదు. కానీ మంచు లక్ష్మి డ్యాన్స్ పై […]

Written By: NARESH, Updated On : May 1, 2022 8:44 am
Follow us on

Acharya Manchu Laxmi: మంచువారి ఆడపడుచు మరోసారి వార్తల్లోకెక్కింది. మోహన్ బాబు కూతురు అయిన మంచు లక్ష్హి సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా లక్ష్మి బుల్లెట్టు బండెక్కి వస్తా.. సాంగ్ కు డ్యాన్స్ చేసి ఇరగదీసింది. ఇక్కడ ఆమెతో పాటు తన ఆరేళ్ల కూతురు కూడా నృత్యంలో పాలుపంచుకుంది. సాధారణంగా సినిమా నటులు ఇలా డ్యాన్స్ చేయడం పెద్ద విషయం కాదు. కానీ మంచు లక్ష్మి డ్యాన్స్ పై కొందరు నెటిజన్లు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మంచు లక్ష్మికి ఇంత సంతోషం రావడానికి ‘ఆచార్య ఫ్లాప్ అయిందనేనా..?’ అని ఓ నెటిజన్ చేసిన కామెంట్ వైరల్ గా మారింది. గతంలో మోహన్ బాబు సినిమా సన్నాఫ్ ఇండియా సినిమా రిలీజ్ సమయంలో మంచు లక్ష్మిపై కొందరు విపరీత ట్రోలింగ్ చేశారు. ఆ సమయంలో మంచు లక్ష్మి ఏం మాట్లాడినా ఆటాడేసుకున్నారు. అయితే ‘ఆచార్య’ సినిమా సందర్భంగా మంచు లక్ష్మి మరోసారి వార్తల్లోకెక్కారు.

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య మూవీ ఈనెల 29న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కాస్త నెగెటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో కొందరు ఆచార్య సినిమాపై సెటైర్లు వేస్తున్నారు. వాటిని మెగా ఫ్యాన్స్ తిప్పికొడుతున్నారు. కానీ తాజాగా మంచు లక్ష్మి ఆచార్య సినిమా ఫెయిలయిందనే సంతోషంగా డ్యాన్స్ చేసిందని అంటున్నారు. ఈ విషయం ఆమె స్వయంగా చెప్పకపోయినా ఆమె వీడియోకు ఇచ్చిన ట్యాగ్ మెగా సినిమా కోసమేనని అర్థమవుతోంది. ఆమె డ్యాన్స్ చేసిన వీడియోకు ‘మేం కాస్త ఫన్ చేశాం’ అంటూ క్యాప్షన్ పెట్టారు. దీంతో నెటిజన్లు ఈ క్యాప్షన్ ను భట్టి రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

బుల్లెట్టు బండెక్కి వస్తా.. సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ కు స్టార్ హీరోయిన్లు సైతం డ్యాన్స్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారు. కానీ మంచు లక్ష్మి ఇప్పటి వరకు ఆ సాంగ్ కు డ్యాన్స్ చేయలేదు. ఇప్పుడు ఆచార్య సినిమా రిలీజైనందువల్లే బుల్లెట్టు బండి పాటకు డ్యాన్స్ చేసి వీడియో పెట్టారని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోలో మంచు లక్ష్మి నైటిపై ఉంది. అలాగే ఆమె కూతురు విద్యా నిర్వాణ కూడా తల్లితో కలిసి పార్ట్స్ పేట్ చేసింది. ఇద్దరు కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసిన తరువాత మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ కొందరు ఆచార్య సినిమాతో ముడిపెట్టి కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది. కొందరు పాజిటివ్ కామెంట్స్ చేయగా.. మరికొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘ఎంత ఊపినా అవకాశాలు రావు’ అని కామెంట్ చేశారు. మరోనెటిజన్ ‘ఆచార్య ఫెయిల్ అయిందనే ఇంత సంతోషమా..?’ అని రాసుకొచ్చాడు. అయితే మంచు లక్ష్మీ ఈ డ్యాన్స్ ఎందుకు..? ఎవరికోసం..? చేశారో తెలియదు గానీ.. మొత్తానికి మరోసారి ట్రోలింగ్ లిస్టులో పడ్డారు. ఈ ట్రోలింగ్ లోకి మంచు విష్ణు, మంచు మనోజ్ లు ఎంట్రీ ఇస్తారా..? చూడాలి..