Samantha: నేటి తరం హీరోయిన్స్ లో అందం తో పాటుగా అభినయం కనబరిచే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో సమంత ఒక్కరు..ఎప్పుడు కొత్తదనం కోరుకునే సమంత కేవలం హీరోయిన్స్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా నేటి తరం ఆకట్టుకునే విధంగా విభిన్నమైన పాత్రలను సైతం వెయ్యడానికి సిద్ధం అయ్యిపోతుంది..నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత కెరీర్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమంత ఇప్పుడు టాలీవుడ్ , కోలీవుడ్ మరియు బాలీవుడ్ లలో వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతుంది..ఇటీవలే ఆమె హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం ‘కాదువాకల రెండు కాదల్’ మంచి పాజిటివ్ రివ్యూస్ ని సంపాదించుకొని సమంత కెరీర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..విజయ్ సేతుపతి హీరో గా నటించిన ఈ సినిమాలో నయనతార మరో హీరోయిన్ గా నటించింది..నయనతార కాబొయ్యే భర్త విగ్నేష్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ మంచి కామెడీ ఎంటర్టైనర్ గా జనాలను ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది.

ఇక ఈ సినిమా తర్వాత సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న చిత్రం శాకుంతలం..ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నాడు.
Also Read: Acharya OTT Release: ఆచార్య OTT రిలీజ్ డేట్ అప్పుడేనా..?
ఈ సినిమా మొత్తం గ్రాంధిక బాషా మాట్లాడే అవసరం ఉండడం తో సమంత ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 5 నెలల సమయం కేటాయించి గ్రాదికం నేర్చుకుంది..అంతే కాకుండా ఈ సినిమా కోసం ఏకంగా ఆమె 6 సినిమాలను కూడా వదిలేసుకుంది..ఎందుకంటే ఈ మూవీ కంటెంట్ పై ఆమెకి ఉన్న అపారమైన నమ్మకం అలాంటిది..సమంత ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న ఈ సినిమా కోసం ఆమె అభిమానులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు..కానీ ఇటీవల సమంత పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుండి ఆమెకి సంబంధించిన ఒక్క లుక్ ని విడుదల చేసింది టీం..ఈ లుక్ ఎందుకో ఆమె అభిమానులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

సమంత ఇంత కస్టపడి చేస్తున్న సినిమా ఇదా , దీనికోసం అన్నీ సినిమాలను వదులుకోవాల్సిన అవసరం ఏమి ఉంది అంటూ ఆందోళన చెందుతున్నారు..కానీ ఇటీవల సమంత ఎంచుకుంటున్న స్క్రిప్ట్స్ అన్నీ అద్భుతంగా జనాలను ఆకట్టుకున్నాయి..కాబట్టి ఈ సినిమా కూడా కచ్చితంగా ఆకట్టుకునే విధంగానే ఉంటుంది అని ఆశలు పెట్టుకోవచ్చు..చూడాలి మరి సమంత నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా జనాలను ఎంత వరుకు ఆకట్టుకుంటుందో.
Also Read:IPL CSK: సంచలనం.. జడేజా ఫ్లాప్.. ‘చెన్నై’ పగ్గాలు ధోనికే బ్యాక్..