Accident in Satyasai District: ఓ చిన్న ప్రాణి చేసిన పనితో ఐదుగురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. చేయని తప్పుకు ఫలితం అనుభవించారు. విద్యుత్ వైరు తెగిపడి మహిళలు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఏపీఎస్ డీపీడీసీఎల్ సీఎండీ హరనాథ రావు విచారణ జరిపి నివేదిక అందించాలని ఆదేశించారు దీంతో అధికారులకు తెలిసిన నిజాలు నివ్వెర పరుస్తున్నాయి. ఒక ఉడుత చేసిన పనికి ఏకంగా ఐదుగురు ప్రాణాలు హరీమనడం గమనార్హం.

ఉడుత విద్యుత్ వైరును కొట్టడంతో అది తెగిపడటంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం విధి వైపరీత్యమే. ఇందులో వారు చేసిన పాపం ఏమిటి? వారికి ఉడుతే శాపంగా మారింది. ఆటో డ్రైవర్ తో సహా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా ఆటోలో మంటలు చెలరేగడంతో ఏం జరుగుతుందో ఎవరకి అర్థం కాలేదు. దీంతో ఏం చేయాలో కూడా తెలియలేదు. విధి ఆడిన వింత నాటకానికి మహిళలే సమిధలు కావడం ఆందోళన కలిగించేదే.
Also Read: KTR- Modi: మోడీదీ మోసమైతే తమరిదేంటిది కేటీఆర్ సార్?
శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం గుండంపేట, పెద్దకోట్ల గ్రామాకు చెందిన 12 మంది కూలీలు వ్యవసాయ పనుల కోసం ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యలో చేరుకునేసరికి ఒక్కసారిగా విద్యుత్ వైరు తెగిపడింది. దీంతో ఆటోలో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఐదుగురు మహిళలు సజీవదహనమయ్యారు. మరో 8 మందికి గాయాలు కావడం తెలిసిందే. చనిపోయిన వారందరు 35 ఏళ్ల లోపు మహిళే కావడంతో రోదనలు మిన్నంటాయి.

సంఘటనపై సీఎం జగన్ దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనకు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. అధికారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని ప్రమాదంపై ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఉడత చేసిన సాయం అందరికి తెలిసిందే కానీ ఇలాంటి అపాయాలు సృష్టించడం మాత్రం ఊహించనదే.
Also Read:KCR Back Step On BRS: ప్రత్యామ్నాయ ఎజెండా పక్కకేనా.. బీఆర్‌ఎస్‌పై తర్జనబర్జన..!