Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ భారతీయ వెండితెరకు పరిచయం అక్కరలేని నటుడు. అమితాబ్ అంటే ఏమిటో షోలే, జంజీర్, బ్లాక్, పీకూ, పింక్ చిత్రాలు చెబుతాయి. ఇప్పటికీ ఆయన నటిస్తూనే ఉన్నారు. తన వయసుకు తగ్గ పాత్రలు వేస్తూ కుర్రకారుకు పోటీ ఇస్తున్నారు. అటువంటి మేటి నటుడు కాబట్టే విశ్వవిఖ్యాతమైన పురస్కారాలు ఆయన పాదాక్రాంతమయ్యాయి. నటుడిగా మాత్రమే కాకుండా అద్భుతమైన వ్యాఖ్యాతగా ఆయన బుల్లితెరకు పరిచయం. కౌన్ బనేగా కరోడ్ పతి.. ఈ ఒక్క కార్యక్రమం చాలు అమితాబ్ స్టామినా ఏంటో చెప్పేందుకు.. కానీ అలాంటి విశ్వవిఖ్యాత నటుడి పై కొంతమంది కుళ్ళు జోకులు వేశారు. ఇదంతా చూస్తున్న మరో నటుడు ఆ వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.. ఆ కార్యక్రమం మధ్యలో నుంచే లేచి వెళ్లిపోయాడు. ఇంతకీ ఏమిటా కథ!

నేను ఫూల్ కాదు
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన వ్యక్తి అభిషేక్ బచ్చన్. భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత కూలెస్ట్ యాక్టర్. ఏ విషయంలోనూ పెద్దగా స్పందించని అతడు.. ఈమధ్య ఒక విషయంలో మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. తాజాగా తన తండ్రి అమితాబ్ పై జోక్ వేయడంతో షో సెట్ నుంచి అభిషేక్ వాకౌట్ చేశాడు. నేనేమీ ఫూల్ కాదని వారికి చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని నిర్వాహకులకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఘటనతో ఆ కార్యక్రమానికి హోస్టులుగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటులు రితేష్ దేశ్ ముఖ్, కపిల కుశ షాక్ అయ్యారు. హిందీలోని ఒక ఛానల్ లో కేస్ తో బన్ తా హై అనే ఒక కార్యక్రమం ప్రసారమవుతున్నది. దీనికి రితేష్, కపిల కుశ హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. ఈ టాక్ షో అమెజాన్ మినీ టీవీలో ప్రసారం అవుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి అతిథిగా ఈ మధ్య అభిషేక్ బచ్చన్ వచ్చాడు. ఇందులో భాగంగా పరిదోష్ త్రిపాఠి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పై ఒక జోక్ వేశాడు.

దీంతో జూనియర్ బచ్చన్ ఆగ్రహానికి గురయ్యాడు..” నేను ఈ షోలో పాల్గొనేందుకు వచ్చాను. ఏమైనా ఉంటే నాతో మాట్లాడండి. జోకులు నామీద వేయండి. అంతేకానీ ఎటువంటి సంబంధం లేని నా తల్లిదండ్రులను ఇందులోకి లాగకండి. మీరు హద్దులు మీరు ప్రవర్తించకండి. నా తండ్రి మీద జోక్స్ వేస్తే నాకు అసలు నచ్చదు” అభిషేక్ బచ్చన్ ఫైర్ అయ్యాడు. జూనియర్ బచ్చన్ కు సర్ది చెప్పేందుకు పరితోష్ ప్రయత్నించాడు. పరిస్థితులను చక్కదిద్దేందుకు కేస్ తో బన్ హై నిర్వాహకులు ప్రయత్నించారు. అయినప్పటికీ అభిషేక్ వెనక్కి తగ్గలేదు. షూటింగ్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ పరిణామంతో అక్కడ ఉన్న వారంతా షాక్ కు గురయ్యారు. ఈ టాక్ షో కు గతంలో చాలామంది సెలబ్రిటీలు వచ్చారు.. విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్, సంజయ్ దత్, అనీల్ కపూర్, అర్జున్ కపూర్, మలైకా ఆరోరా వంటి వారు టాక్ షోలో పాల్గొని సందడి చేశారు. కానీ తన తండ్రి పై జోకులు వేయడంతో అభిషేక్ బచ్చన్ షో మధ్యలోనే వదిలి వెళ్ళిపోయాడు. ఈ వివాదం బాలీవుడ్ లో తీవ్ర చర్చకు దారి తీసింది. కానీ ఇంతవరకు దీనిపై అమితాబచ్చన్ నోరు మెదపకపోవడం గమనార్హం.