Nayanthara: స్టార్ లేడీ నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్లు డేటింగ్ చేసిన ఈ జంట 2022 జూన్ 9న మహాబలేశ్వర్వంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకకు షారుక్, అమితాబ్, రజినీకాంత్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. నిజానికి నయనతార-విగ్నేష్ వివాహం తిరుమలలో జరగాల్సింది. కొన్ని కారణాలతో మహాబలేశ్వరంలో జరిపారు. వివాహం అనంతరం కొత్త దంపతులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అయితే ఈ నవదంపతుల తిరుమల ట్రిప్ వివాదాస్పదమైంది. తిరుమల మాడవీధుల్లో చెప్పులు వేసుకొని నయనతార సంచరించారు.

మీడియాలో బయటికి వచ్చిన ఆమె ఫోటోలను చూసి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. టీటీడీ నయనతార దంపతులపై చర్యలకు సిద్ధమైంది. నయనతార క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో వివాదం ముగిసింది. ఆ విషయం పక్కన పెడితే విగ్నేష్, నయనతార హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో నయనతార ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారట. నయనతార తల్లి కావాలని ఆశపడుతున్నారట. దీని కోసం ఆమె కఠిన నిర్ణయం తీసుకున్నారట. కొత్త సినిమాలకు సైన్ చేయకూడదు అంటుకుంటున్నారట.
గతంలో ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేస్తున్న నయనతార నూతన ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం లేదట. దర్శక నిర్మాతలు వచ్చి సంప్రదిస్తున్నా… సున్నితంగా తిరస్కరిస్తున్నారట. ఈ న్యూస్ ఆమె అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. అంటే ఇకపై నయనతార సిల్వర్ స్క్రీన్ పై కనిపించరా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరీ అంత బాధపడాల్సిన అవసరం లేదు. కొత్త సినిమాలు చేయకపోయినా ఆమె నటిస్తున్న నాలుగు ప్రాజెక్ట్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. అవి రానున్న రెండేళ్లలో విడుదల కానున్నాయి. కాబట్టి అభిమానులు ఎంజాయ్ చేయవచ్చు.

ఇక నయనతార పర్సనల్ లైఫ్ లో అనేక వివాదాలు ఉన్నాయి. కెరీర్ బిగినింగ్ లో నయనతార హీరో శింబుతో ఎఫైర్ నడిపారు. వారి ప్రైవేట్ పిక్స్ సైతం మీడియాలో హల్చల్ చేశాయి. శింబుతో బ్రేకప్ అయ్యాక పెళ్ళైన ప్రభుదేవాను ప్రేమించారు. వీరి వ్యవహారం పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. ముచ్చటగా మూడో బంధం విగ్నేష్ తో కుదిరింది. లాంగ్ రిలేషన్ షిప్ ఎంజాయ్ చేసిన ఈ జంట ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కారు. 2015లో విడుదలైన నానుమ్ రౌడీదాన్ చిత్రంలో నయనతార నటించారు. ఆ చిత్ర దర్శకుడైన విగ్నేష్ తో ఆమెకు ప్రేమ బంధం మొదలైంది.