Suhana Khan Khushi Kapoor : ఫుల్ గా మందుకొట్టి బాయ్ ఫ్రెండ్ తో దొరికిన స్టార్ హీరో కూతురు!

Suhana Khan Khushi Kapoor : గోల్డెన్ స్ఫూన్ తో పుట్టిన వారసుల జీవితాలు తప్పుదోవపడుతూ ఉంటాయి. అడిగింది కొనిచ్చే పేరెంట్స్, చిన్న వయసులోనే ఖరీదైన కార్లు వారిని లగ్జరీ జీవితానికి అలవాటు పడేలా చేస్తాయి. లక్షల్లో పాకెట్ మనీ ఇచ్చే తల్లిదండ్రులు ఉండగా నైట్ పార్టీలు అంటూ పబ్బులో తప్ప తాగుతూ మత్తులో మునిగి తేలుతూ ఉంటారు. నరాల్లో పబ్ కల్చర్ ఎక్కువైపోగా… మందు, డ్రగ్స్, గంజాయి వంటి చెడు అలవాట్ల బారినపడే వారి సంఖ్య […]

Written By: NARESH, Updated On : December 26, 2022 9:55 pm
Follow us on

Suhana Khan Khushi Kapoor : గోల్డెన్ స్ఫూన్ తో పుట్టిన వారసుల జీవితాలు తప్పుదోవపడుతూ ఉంటాయి. అడిగింది కొనిచ్చే పేరెంట్స్, చిన్న వయసులోనే ఖరీదైన కార్లు వారిని లగ్జరీ జీవితానికి అలవాటు పడేలా చేస్తాయి. లక్షల్లో పాకెట్ మనీ ఇచ్చే తల్లిదండ్రులు ఉండగా నైట్ పార్టీలు అంటూ పబ్బులో తప్ప తాగుతూ మత్తులో మునిగి తేలుతూ ఉంటారు. నరాల్లో పబ్ కల్చర్ ఎక్కువైపోగా… మందు, డ్రగ్స్, గంజాయి వంటి చెడు అలవాట్ల బారినపడే వారి సంఖ్య ఎక్కువైపోయింది. ముఖ్యంగా స్టార్ కిడ్స్… అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా మత్తులో తూగుతూ మీడియా కంట పడుతున్నారు.

ఇటీవల అమీర్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ తప్పతాగి మీడియా కంటికి చిక్కారు. తాజాగా మరో స్టార్ హీరో కూతురు మైకంలో తేలుతూ కనిపించింది. అజయ్ దేవ్ గణ్-కాజోల్ దంపతుల కూతురు నయాసా దేవ్ గణ్ మైకంలో తూలుతూ కనిపించారు. ఆమె తన ఫ్రెండ్ ఒర్రితో పాటు నైట్ పార్టీకి వచ్చినట్లు తెలుస్తుంది. ఒర్రి, నయాసా బాగా మత్తులో ఉన్నారు. పబ్ బయటకు వచ్చేటప్పుడు వారు తూలుతూ కనిపించారు. నయాసా చేతిని పట్టుకొని ఒర్రి అటూ ఇటూ తిరుగుతున్నాడు.

ఇక నయాసాకు అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, అతని వెనకాలే తిరుగుతుంది. ఆమె డ్రెస్ చాలా బోల్డ్ గా ఉంది. బాగా కిక్కులో ఉన్నట్లు కళ్ళు చూస్తే తెలుస్తుంది. నయాసా మత్తులో తూగుతున్న వీడియో వైరల్ గా మారింది. ఇక నయాస పై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. సమాజంలో పేరు పలుకుబడి ఉన్న గొప్పోళ్ళ పిల్లలు అయ్యుండి, వారి పరువు తీస్తున్నారు అంటున్నారు. మరి కొందరు పెంపకం సరిగా లేదంటూ అజయ్ దేవ్ గణ్-కాజోల్ లను తిట్టిపోస్తున్నారు.

1995లో విడుదలైన జిగర్ మూవీ షూటింగ్ సమయంలో కాజోల్-అజయ్ దేవ్ గణ్ ప్రేమలో పడ్డారు. 1999లో ఈ జంట వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం. 2003లో నయాసా దేవ్ గణ్ జన్మించారు. ఇంకా 20 ఏళ్ళు కూడా నిండని నయాసా పబ్బుల్లో తప్ప తాగుతూ తిరుగుతుంది. 21 ఏళ్ళు లోపు యువకులకు మద్యం అమ్మరాదు. పెద్ద పెద్ద పబ్బుల్లోనే ఈ నిబంధన ఉల్లంఘనకు గురవుతుంది. ఇండియాలో పేరుకే రూల్స్, అవి పాటించే నాథుడు కనబడడు.