https://oktelugu.com/

Aadhaar: ఆధార్ కార్డ్ పోయిందా..? కొత్త కార్డు పొందడం ఎలా..?

ఆధార్ కార్డును ప్రభుత్వం తరపున భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) జారీ చేస్తుంది. వ్యక్తిగత గుర్తింపు కోసం ఈ కార్డు ముఖ్యమని చెప్పుకోవచ్చు. ప్రతి పనిలో ఎక్కువగా ఉపయోగించే ప్రభుత్వ పత్రాలలో ఆధార్ కార్డు ప్రధానమైనది. అంతేకాదు దేశ వ్యాప్తంగా చిరునామా రుజువుగా కూడా ఇది పని చేస్తుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 17, 2024 6:34 pm
    Aadhaar
    Follow us on

    Aadhaar: ఆధార్ కార్డు… ప్రస్తుతం ప్రతి పనికి ఆధార్ తప్పనిసరిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది లేకపోతే ఎటువంటి పనులు అయినా ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఆధార్ కార్డు వినియోగం రోజురోజుకు పెరిగిపోతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అందుకే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. అయితే మీ ఆధార్ కార్డు ఎప్పుడైనా పోతే..? లేదా ఇతరత్రా కారణాల వలన పాడైపోయినా ..? చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పనులన్నీ ఆగిపోతాయి. ఈ విధంగా ఇబ్బంది పడకుండా డూప్లికేట్ ఆధార్ కార్డును సులభంగా పొందవచ్చు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

    ఆధార్ కార్డును ప్రభుత్వం తరపున భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) జారీ చేస్తుంది. వ్యక్తిగత గుర్తింపు కోసం ఈ కార్డు ముఖ్యమని చెప్పుకోవచ్చు. ప్రతి పనిలో ఎక్కువగా ఉపయోగించే ప్రభుత్వ పత్రాలలో ఆధార్ కార్డు ప్రధానమైనది. అంతేకాదు దేశ వ్యాప్తంగా చిరునామా రుజువుగా కూడా ఇది పని చేస్తుంది.

    మనలో ఎవరైనా ఒరిజినల్ ఆధార్ కార్డును పొగొట్టుకున్నా… లేక ఉపయోగించే పరిస్థితి లేని సమయంలో యూఐడీఏఐ నుంచి డూప్లికేట్ ఆధార్ కార్డును పొందవచ్చు. ఇందుకోసం మనం ముందుగా uidai.gov.in అనే వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. వెబ్ సైట్ లోకి వచ్చిన తరువాత మై ఆధార్ అనే ట్యాబ్ ను క్లిక్ చేయాలి. ‘మై ఆధార్’ విభాగంలో ఉన్న జాబితాలో ఆర్డర్ ఆధార్ రీ ప్రింట్ ను ఎంచుకోవాలి. ఆ తరువాత స్క్రీన్ పై కనిపించే సెక్యూరిటీ కోడ్ తో పాటు మన 12 అంకెల ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి. లేదా 16 అంకెలతో ఉన్న వర్చువల్ ఐటీని నమోదు చేయాలి.

    ఆధార్ నంబర్ ను నమోదు చేసిన అనంతరం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) వస్తుంది. అది ఎంటర్ చేయగానే.. వివరాలను సమీక్షించే పేజీకి వెళ్తారు.. అక్కడ సమాచారం సరైనదని నిర్ధారించుకున్న తరువాత ఆధార్ రీ ప్రింట్ కోసం చెల్లింపులు చేయాలి.. ఆ తరువాత సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ తో పాటు కన్ఫామ్ మెసేజ్ ను అందుకుంటారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల్లో ఆధార్ కార్డు ప్రింట్ చేసి.. పోస్ట్ ద్వారా మన చిరునామాకు పంపిస్తారు.

    ఆధార్ కార్డు చేతికి వచ్చేంత వరకు వెబ్ సైట్ నుంచి ఈ -ఆధార్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే మన ఆధార్ కార్డు ఎక్కడి వరకు వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవడానికి UIDAI వెబ్ సైట్ లోకి వెళ్లి.. మై ఆధార్ ట్యాబ్ లో చెక్ ఆధార్ రీప్రింట్ స్టేటస్ ను సెలెక్ట్ చేయాలి.. ట్రాక్ ను తెలుసుకునేందుకు ఆధార్ నంబర్ నంబర్ ను నమోదు చేయాల్సి ఉంటుంది.

    ఆధార్ కార్డు విషయంలో ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం కోసం యూఐటీఏఐ టోల్ – ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ -1947 ను కూడా సంప్రదించే అవకాశం ఉంది. అలాగే phonehelp@uidai.gov.in అనే అధికారిక ఈ -మెయిల్ ను కూడా సంప్రదించవచ్చు.