Idea: ఒక్క ఐడియాతో నెలకు కోటి సంపాదిస్తున్న యువతి..!

Idea: ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని అందరూ వినే ఉంటారు. అచ్చం అలాంటి సంఘటనే ఆమె జీవితంలో జరిగింది. చిన్నచిన్న చిట్కాలు, మెలకువలను నేర్పుతూ ఓ యువతి అక్షరాల నెలకు కోటి రూపాయాలను సంపాదిస్తోంది. తనకు వచ్చిన పనిని నలుగురితో షేర్ చేసుకుంటూ సంతృప్తిని పొందటమేగాక కోట్లల్లో సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇంతకీ ఆ యువతి ఎవరు? ఏం చేసి నెలకు కోటి రూపాయాలు సంపాదిస్తుందనేగా మీ డౌట్.. ఇక అసలు పాయింట్ కు వస్తే.. […]

Written By: NARESH, Updated On : December 3, 2021 2:21 pm
Follow us on

Idea: ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని అందరూ వినే ఉంటారు. అచ్చం అలాంటి సంఘటనే ఆమె జీవితంలో జరిగింది. చిన్నచిన్న చిట్కాలు, మెలకువలను నేర్పుతూ ఓ యువతి అక్షరాల నెలకు కోటి రూపాయాలను సంపాదిస్తోంది. తనకు వచ్చిన పనిని నలుగురితో షేర్ చేసుకుంటూ సంతృప్తిని పొందటమేగాక కోట్లల్లో సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

Kate Norton

ఇంతకీ ఆ యువతి ఎవరు? ఏం చేసి నెలకు కోటి రూపాయాలు సంపాదిస్తుందనేగా మీ డౌట్.. ఇక అసలు పాయింట్ కు వస్తే.. ఆ యువతి పేరు కేట్ నోర్టన్(27). న్యూయర్క్ చెందిన కేట్ నోర్టన్ ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఖాళీ సమయంలో తనకు కంప్యూటర్లో బాగా పట్టున్న, మిగిలిన వాళ్లు బోర్ గా ఫీలయ్య ఎక్సెల్, గుగూల్ షీట్ పై ఆన్ లైన్ క్లాసులు చెప్పడం ప్రారంభించింది.

ఇందుకోసం ఇన్ స్ట్రాగ్రామ్, టిక్ టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ‘మిస్ ఎక్సెల్’ పేరిట ఖాతాను తెరిచింది. సరదాగా డాన్స్ చేస్తూ ఎక్సెల్, గుగుల్ షీట్స్ పై బోధనలు చేయడం ప్రారంభించింది. ఈ ఆన్ క్లాసులు చాలా వినోదాత్మకంగా సాగుతుండటంతో ఆమె ఫాలోవర్స్ సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.

Also Read: ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ వడ్డీ.. ఎలా అంటే?

గతేడాది నవంబర్లో ఆన్ క్లాసులు మొదలు పెట్టిన కేట్ నోర్టన్ కు క్రమంగా ఆదాయం పెరిగింది. 2021 ఏప్రిల్ నాటికి ఆమెకు నెలకు కోటి రూపాయాల ఆదాయం రావడం ప్రారంభమైంది. దీంతో ఆమె తాను చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్నిసైతం వదిలి పూర్తిగా ఆన్ లైన్ తరగతులపైనే ఫోకస్ పెట్టింది. ఆమె భర్త సైతం ఉద్యోగాన్ని వదిలి ఆమె సాయం చేస్తున్నాడు.

ఎక్సెల్, గుగుల్ షిట్స్ పై మెలకువలు, చిట్కాలతో ప్రారంభమైన ‘మిస్ ఎక్సెల్’ ప్రస్తుతం కేట్ నోర్టన్ కు కోట్లలో ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. దీంతో కేట్ దంపతులు బిజినెస్ ను మరింత విస్తరించే పనిలో పడ్డారు. శిక్షకురాలిగా మాత్రమే కాకుండా ఆన్ లైన్ ప్రొడక్స్, ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తూ తీరిక లేకుండా కేట్ నోర్టన్ డబ్బులను సంపాదిస్తూ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తోంది.

Also Read: ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగుతున్నారా.. ఆ సమస్యలు వచ్చే అవకాశం?