Viral Video: మనిషికి సహనం ఉండాలి. క్షమా గుణం కూడా ఉండాలి. అప్పుడే మనిషి జన్మకు పరిపూర్ణత లభిస్తుంది. అలాకాకుండా ఎదుటి మనిషిని ఊరికనే కోప్పడితే.. ఆగ్రహంతో మీదికి మీదికి దూసుకెళ్తే.. కారణం లేకుండా పెద్ద గొడవ చేస్తే.. ఎలా ఉంటుంది? వీటన్నింటికీ కారణమైన మనిషిని తిట్టాలి అనిపిస్తుంది. సరైన బుద్ధి చెప్పాలనిపిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత.. మీకు ఎలా అనిపిస్తుందో మరి..
ముందుగానే చెప్పినట్టు మనిషికి సహనం కచ్చితంగా ఉండాలి. కొందరు కారణం లేకుండానే సహనం కోల్పోతారు. ఎదుటి వారి మీద ప్రతీకారానికి దిగుతారు. ఇలాంటి షాకింగ్ సంఘటన విదేశాలలో జరిగింది. ఓ గ్యాస్ స్టేషన్ వద్ద కు ఓ యువతి కారు తీసుకొని వెళ్ళింది. తన వాహనంలో గ్యాస్ నిండుకోడంతో దానిని రీఫిల్ చేసేందుకు తన కారును అక్కడ ఆపింది. లోగా కారులో నుంచి బయటికి దిగి గ్యాస్ నింపే వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. ఒక సిగరెట్ కావాలి అని అడిగింది. దానికి అతడు నాకు సిగరెట్ తాగే అలవాటు లేదు, నేను ఇవ్వలేను అని చెప్పాడు. ఈ మాత్రం దానికి ఆ యువతి పిచ్చెక్కిన దానిలాగా ప్రవర్తించింది. వెంటనే చిర్రెత్తిపోయి కారులో ఉన్న లైటర్ తీసుకొచ్చి గ్యాస్ నింపే చోట అంటించింది. వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. గ్యాస్ నింపే వ్యక్తి బతుకు జీవుడా అంటూ పరుగులు తీశాడు. అనంతరం ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పింది.
ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు అక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఘటనకు కారణమైన యువతిని అరెస్టు చేశారు.. ప్రస్తుతం ఆమెను కోర్టులో హాజరు పరిచారు. ఈ ఘటన తర్వాత గ్యాస్ స్టేషన్లలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాటి యజమానులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఆ యువతి చేసిన దారుణానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ వీడియో రెండు మిలియన్ల వ్యూస్ నమోదు చేసింది. ఆ యువతి కోపాన్ని చూసిన కొంతమంది నెటిజన్లు ఈమెకు ఇదేం తిక్క అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మానసిక స్థితి సరిగ్గా లేకుంటే ఆసుపత్రిలో చూపించుకోవాలని సూచిస్తున్నారు.
Woman asks man for a cigarette, when he refuses she lights his car on fire pic.twitter.com/iH7YHI8Pbq
— non aesthetic things (@PicturesFoIder) February 16, 2024