Viral News: సాధారణంగా ఒక మహిళ తాను గర్భం దాల్చినపుడు శరీరంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి.. నెలసరి ఆగిపోతుంది.. శిశువు పెరుగుతున్న కొద్దీ పొట్ట భాగం ముందుకు వస్తుంది. గర్భంలో శిశువు కదలికలు ఉంటాయి.. ఆకలి ఎక్కువగా వేస్తుంది. గర్భంలో శిశువు కూడా ఉంటుంది కాబట్టి గర్భిణి అధికంగా ఆహారం తీసుకోవాల్సి వస్తుంది..ఈ ప్రక్రియలన్నీ సహజంగా జరిగేవే. కానీ ఒక మహిళ తాను గర్భం దాల్చినట్టు గుర్తించలేకపోయింది. పైగా ఒక విమానం టాయిలెట్ లో ప్రసవించింది. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. నిజంగానే జరిగింది.

టాయి లెట్ లో ప్రసవించింది
తమరా అనే మహిళ ఈక్వేడార్ లోని గుయాక్విల్ నుంచి ఆమ్ స్టర్ డామ్ కు కే ఎల్ ఎం రాయల్ డచ్ విమానంలో ప్రయాణిస్తోంది. విమానం రన్ వే నుంచి బయలుదేరింది. విమానం వేగం పుంజుకుని గాలిలో ఉండగా ఆమెకు అకస్మాత్తుగా కడుపు నొప్పి వచ్చింది.. దీంతో ఆమె టాయ్ లెట్ కు వెళ్ళింది.. దీంతో ఆమె ఒక శిశువుకు జన్మనిచ్చింది.. ఇది విమానంలోని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.. తమారా ఈక్వెడార్ నుంచి స్పెయిన్ లోని ఆమ్ స్టర్ డామ్ కు వెళ్లేందుకు షిపోల్ విమానాశ్రయంలో ఆగింది. అక్కడ ఆమె విమానం ఎక్కింది. ” నెదర్లాండ్స్ లో దిగేందుకు కొన్ని గంటల ముందు ఆమె కడుపు నొప్పితో బాధపడింది. దీంతో ఆమె టాయ్ లెట్ కు వెళ్లాలి అని నిర్ణయించుకుంది.” అని తోటి ప్రయాణికులు తెలిపారు. ఆమెను ప్రసవం అనంతరం గుస్తుయిస్ హార్లెమ్ జుయిడ్ ఆసుపత్రి కి తరలించారు.

ఆ ఆసుపత్రి ప్రతినిధి మాట్లాడుతూ” ఆమెకు ఆకస్మాత్తుగా కడుపునొప్పి వచ్చింది. రెండు ఇంకో సంకోచాల తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చింది.” అని తెలిపారు. కాగా ఇంత జరిగినప్పటికీ తను గర్భవతి అని తమరాకు తెలియకపోవడం ఆశ్చర్యకరం. ఇదే సమయంలో ఆ విమానంలో ఆస్ట్రియాకు చెందిన ఇద్దరు వైద్యులు, ఒక నర్స్ ఉన్నారు.. డెలివరీ సమయంలో తమరాకు సహాయం చేశారు.. ఈ సందర్భంగా జన్మించిన ఆ శిశువుకు మాక్సి మిలియానో అని పేరు పెట్టారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ బాగానే ఉన్నారు.. షిపోల్ వద్దకు విమానం చేరుకున్న తర్వాత తల్లి, నవజాత శిశువును అంబులెన్స్ లో స్పార్నే గస్తుయిస్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. కాగా సంఘటన వైరల్ గా మారింది.