Odisha: పెళ్లి తర్వాత వివాహేతర సంబంధాలు కొనసాగించడం, కొత్త సంబంధాలు పెట్టుకోవడం ఇటీవల కామన్ అయ్యాయి. ఇందుకు ఎవరైనా అడ్డువస్తే.. వారిని తప్పించేందుకు కూడా వెనుకాడడం లేదు. కొన్నాళ్లు గుట్టుగా ఈ వ్యవహారం నడిపించి.. బయట పడ్డాక తెగిస్తున్నారు. చచ్చిపోవడం, చంపడం లాంటి నేరాలకు పాల్పడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం పారిపోయిన భార్యలకు ప్రియుడితోనే పెళ్లి జరిపిస్తున్నారు. ఇటీవల ఇలాంటి భర్తల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ప్రియుడితో కలిసి పారిపోయిన భార్యకు పెళ్లి చేశాడు ఓ భర్త. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.
మూడేళ్ల క్రితమే పెళ్లి..
సోన్‌పూర్ జిల్లా శుభలాయి ఠాణా పరిధిలోని కిరాసి గ్రామానికి చెందిన మాధవ ప్రధాన్‌కు మూడేళ్ల క్రితం అనుగుల్ ప్రాంతానికి చెందిన జిల్లితో పెళ్లైయింది. అయితే జిల్లి పెళ్లి తర్వాత కూడా తన దూరుపు బంధువైన పరమేశ్వర ప్రధాన్‌తో సన్నిహితంగా ఉంటుంది. ఇటీవల అతనితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తన భార్య కనిపించడం లేదంటూ మాధవ ప్రధాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వారిని గాలించి పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.
ప్రియుడే కావాలని..
అయితే పోలీస్ స్టేషన్‌కు భార్యను తీసుకువచ్చిన విషయం తెలుసుకున్న మాధవ ప్రధాన్‌తోపాటు కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్లారు. అక్కడ పోలీసులు జిల్లికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తర్వాత మాధవ ప్రదాన్‌తోనూ మాట్లాడారు. అయితే కౌన్సెలింగ్‌లో జిల్లి తాను మాధవ ప్రదాన్‌తో కలిసి జీవించలేనని చెప్పింది. తనకు ప్రియుడు పరమేశ్వర్ ప్రదాన్ కావాలని పట్టుపట్టింది. అతడితోనే ఉంటానని తెగేసి చెప్పింది.
అందరూ ఆశ్చర్యపోయేలా..
భార్య నిర్ణయంతో మాధవ ప్రధాన్ ఆగ్రహానికి లోనుకాలేదు. తనతో ఉంలేని భార తనకు కూడా వద్దనుకున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు పోలీసులు కూడా ఆశ్చర్య పోయేలా తన భార్య జిల్లిని ఆమె ప్రియుడు పరమేశ్వర ప్రధాన్‌తో అక్కడే పెళ్లి జరిపించాడు. ఈ విషయమై మాధవ ప్రధాన్ మాట్లాడుతూ తానంటే ఇష్టంలేని భార్యతో కాపురం చేయడం కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. అంతే కాకుండా జిల్లి పెళ్లి కాకుండా పరమేశ్వర్‌ప్రధాన్‌తో ఉంటే సమాజంలో అవమానం ఎదుర్కొంటుందన్న ఉద్దేశంతో ఆమె క్షేమం కోసమే పెళ్లి కూడా జరిపించినట్లు వెల్లడించాడు.