Mexico: కెమెరా ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాక ఫొటోలు దిగడం సరదాగా మారింది. ఎక్కడికి వెళ్లినా అక్కడ ఓ ఫొటో దిగి సోషల్ మీడియాలో పోసు‍్ట చేయడం కామన్ అయింది. రీల్స్, స్టంట్స్ ఇంకా అదనం. సోషల్ మీడియాలో లైక్స్, షేర‍్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఆ సరదానే ప్రాణాల మీదకు తెస్తోంది. ప్రాణాలు పోయిన ఘటనలూ ఉన్నాయి. సెల్ఫీల మోజుతో ప్రాణాలు పొగొట్టుకున్న వాళ్లెందరో ఉన్నారు. అయినా.. అత్యుత్సాహం ఆపడం లేదు.
రైలుతో సెల్ఫీ దిగుదామని..
తాజాగా మెక్సికోలో ఓ యువతి కదిలే రైలుతో సెల్ఫీ దిగాలనుకుంది. సెకన్ల వ్యవధిలో అందరూ చూస్తుండగానే విగత జీవిగా మారింది. కెనడాకు చెందిన ఎంప్రెస్ అనే ఆవిరి ఇంజిన్ రైలు సుదీర్ఘ ప్రయాణం తర్వాత మెక్సికో సిటీకి చేరుకుంటుంది. ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహణ కోసం ఈ రైలును నడిపిస్తున్నారు. ఈ రైలుకు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ విషయం తెలుసుకున్న అనేక మంది రైలు వెళ్లే దారిలో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు యత్నిస్తుంటారు.
యువతి ప్రయత్నించి..
రైలు వెళ్తున్న సమయంలో దానితో సెల్ఫీ దిగాలని ఓ యువతి ప్రయత్నించింది. అక్కడ చాలా మందే ఉన్నారు. కానీ ఓ యువతి ట్రాక్‌కు దగ్గరగా వెళ్లి సెలీ‍్ఫ తీసుకునే ప్రయత్నం చేసింది. రైలు ఇంజిన్ ముందు ఉన్న ఓ ఇనుప వస్తువు ఆమె తలకు తాకడంతో ఎగిరిపడి మృతిచెందింది. ఈ ఘటనపై రైలు యాత్రను నిర్వహించిన కెనడియన్ ఫసిఫిక్ కానాస్ సిటీ కంపెనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
MEXICO – In Hidalgo, a famous train that comes from Canada and travels all the way to Mexico City, attracting locals, struck a woman who was trying to take a selfie as the train approached. She passed at the scene. Article in comments. pic.twitter.com/32XdsCehEB
— The Many Faces of Death (@ManyFaces_Death) June 5, 2024