Viral Video: సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్న ఓ వీడియోలో ఓ భార్య తన భర్త పై రివెంజ్ మామూలుగా తీర్చుకోలేదు. అతడు చపాతి చేయాలని కోరాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు. నేను అడిగింది చపాతి మాత్రమే కదా ఆ మాత్రం చేయలేవా అన్నాడు. అంతే ఆ ఇల్లాలు ఇల్లు లేచిపోయే విధంగా గోల పెట్టింది. అంతేకాదు చపాతి చేస్తానని ఒక్కసారిగా లేచింది. కాస్త నువ్వు సాయం చేస్తేనే ఈ పని చేస్తానంటూ అతడికి షరతు విధించింది. దీనికి అతడు సరే అన్నాడు. అంతే కిచెన్ లోకి వెళ్లి గోధుమపిండి తీసుకొచ్చింది. వేడి వేడి నీళ్లు అందులో పోసింది. కసా కసా పిసికేసింది. తన భర్తకు కబుర్లు పంపింది. ఆ తర్వాత ఇంటి పక్కన ఉన్న ఖాళి ప్రదేశంలో.. కట్టెల పొయ్యి మీద చపాతి చేస్తానని చెప్పింది. దానికి అతడు ఓకే అన్నాడు. పైగా గ్యాస్ మంట మీద చేసిన వంటలు తిని తిని అతడికి చిరాకు కలిగింది. కట్టెల పొయ్యి అనగానే అతగాడిలో ఒక్కసారిగా ఉత్సాహం ఉరకలెత్తింది. తన భార్య చెప్పినట్టుగానే అతడు ఆ ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళాడు.
నెత్తి మీద ఆ పని చేసింది
చపాతి పిండి సరే.. మరి చపాతీలు కొట్టడానికి పీట ఏది అని అడిగాడు.. దానికి ఆమె మన ఇంట్లో పీట లేదని చెప్పింది. అలాంటప్పుడు చపాతీ ఎలా చేద్దాం అని నన్ను పిలిచావని అతడు నిలదీశాడు. అటు ఇటు చూసిన ఆమె మీ గుండు ఉంది కదా.. దాని మీద చేస్తాను అన్నది. దానికి అతడు ఒప్పుకోలేదు. మీకు చపాతి కావాలా? వద్దా? అని ఆమె ప్రశ్నించింది. దీంతో అతడు సరే అలానే కానివ్వూ అని అన్నాడు. ఆ తర్వాత అతడి గుండు మీదనే ఆమె చపాతీలు వత్తడం మొదలుపెట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు.. నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవడు గ్యారెంటీ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో సోషల్ మీడియాలో హైప్ కోసం ఇలాంటి పనులు చేస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. కిచెన్లో చపాతీలు తయారు చేయడానికి పీట కూడా లేదా? ఎంత బోడిగుండు అయితే మాత్రం భర్త తల మీద చపాతీలు చేస్తారా? రివెంజ్ ఇలా కూడా తీర్చుకుంటారా.. మన మిగతావాళ్లు ఫాలో అయితే పరిస్థితి ఏంటి అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.