Ram Charan Peddi : మన టాలీవుడ్ లో ఇప్పటి వరకు రాయలసీమ యాస మీద వచ్చిన సినిమాలను చాలానే చూశాము , అదే విధంగా తెలంగాణ యాస మీద వచ్చిన సినిమాలను కూడా చాలానే చూశాము , కానీ ఉత్తరాంధ్ర యాస మీద వచ్చిన సినిమాలను చాలా తక్కువ చూశాము . నేడు విడుదల చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో విడుదల చేస్తోంది. ఇందులో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడడం, అది కొంతమందికి అర్థం అవ్వడం, కొంతమందికి కాకపోవడం వల్ల డివైడ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ట్రైలర్ ని చూసి ఒక సినిమా పరిస్థితి ఏంటి అని ఊహించలేము , ట్రైలర్ లో అర్థం అవ్వని డైలాగ్స్ , థియేటర్స్ లో సినిమా చూస్తున్నప్పుడు అర్థం అవ్వొచ్చు అని విశ్లేషకులు చెప్తున్నారు.
అయితే ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషల్లోనూ గ్రాండ్ గా విడుదల కాబోతుంది. కాబట్టి కచ్చితంగా ఈ సినిమా హిట్ అయితే గ్లోబల్ వైడ్ గా ఉత్తరాంధ్ర యాస కి మంచి గుర్తింపు లభిస్తుంది. ‘పుష్ప’ చిత్రం ట్రైలర్ విడుదల రోజు కూడా, చిత్తూరు యాస అర్థం కాలేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెద్ద ఎత్తున గోల చేశారు. కానీ చివరికి ఆ సినిమాలోని డైలాగ్స్ దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. ఇప్పటికీ కూడా ఆ డైలాగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. రేపు ‘పెద్ది’ కి కూడా కంటెంట్ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే , ఇదే రేంజ్ రెస్పాన్స్ రావొచ్చు అనడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇలాంటి సినిమాలు ద్వారా మన రాష్ట్రాల్లోని ప్రదేశాలు, యాస గ్లోబల్ వైడ్ గా ఆడియన్స్ కి పరిచయం చేయడం శుభ పరిణామం, దీని వల్ల టూరిజం కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం నుండి తదుపరి రాబోతున్న కంటెంట్ స్పెషల్ సాంగ్ అని తెలుస్తోంది. ఈ నెల 22 న ఆ సాంగ్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. మరి ఈ సాంగ్ ఐటెం సాంగా?, లేకపోతే థీమ్ సాంగా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ 2 న విజయనగరం లో , జూన్ 3 న హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రెండిట్లో ఎదో ఒక ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా రాబోతున్నాడని టాక్.
