Nara Devaansh : తాత ముఖ్యమంత్రి. దశాబ్దల రాజకీయ అనుభవం ఆయన సొంతం . తండ్రి మంత్రి.. ఆయనకు ఐటి మీద అపారమైన పట్టు.. నానమ్మ డైయిరీ వ్యవస్థాపకురాలు. తల్లి అందులో డైరెక్టర్ గా పని చేస్తూ ఉంటారు.. అటు అమ్మమ్మ.. తాతయ్య కుటుంబం కూడా రాజకీయంగా.. సినిమాలపరంగా ఘన చరిత్ర కలిగిన వారే. ఇటువంటి కుటుంబంలో పుట్టిన ఆ పిల్లాడు అదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. కాకపోతే రాజకీయాల్లో కాకుండా.. వ్యాపారంలో కాకుండా భిన్నమైన దారిని ఎంచుకున్నాడు. తన ఈడు పిల్లలు ఆటపాటలతో సరదాగా గడుపుతూ ఉంటే.. అతడు మాత్రం పరిశోధన అంటూ.. బాల మేధావిగా తన ఆవిష్కరణ బయటపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఏపీ మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ కు సంబంధించి ఒక వీడియో బయటకి వచ్చింది. ఆ వీడియోను నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఆ వీడియోలో నారా దేవాన్ష్ కనిపించారు. నారా లోకేష్ ఏవో ప్రశ్నలు అడిగారు. దానికి ఆయన స్పష్టమైన సమాధానం చెప్పారు. ఫలితంగా నారా దేవాన్ష్ అల్లరి పిల్లాడు కాదు.. అద్భుతమైన మేధస్సు ఉన్నవాడని అర్థమైంది. Dino deets పేరుతో దేవాన్ష్ ఒక యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించాడు. రాక్షస బల్లులు, శిలాజాలు, పురాతన అవశేషాల గురించి కొంతకాలంగా దేవాన్ష్ పరిశోధన చేస్తున్నాడు. వివిధ పుస్తకాలలో ప్రచురితమైన అంశాలను క్రోడీకరించి.. తాను తెలుసుకున్న విషయాలను.. ఆశ్చర్యానికి గురిచేసే అంశాలను.. ఆకట్టుకునే విధంగా రూపొందించాడు. ఈకాలపు పిల్లలకు అర్థమయ్యే విధంగా వాటిని రూపొందించాడు. వీటిని పాడ్ కాస్ట్ రూపంలో తన యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం చేయబోతున్నాడు.
సాధారణ యూట్యూబ్ ఛానల్ మాదిరిగా కాకుండా.. దానికోసం ఒక డైనోసార్ ప్రపంచాన్ని సృష్టించాడు దేవాన్ష్. ప్రాచీన ప్రపంచంలోకి ప్రేక్షకుడి లాగా తన తండ్రిని ఆహ్వానించాడు. దీనిపై అనేక ప్రశ్నలు నారా లోకేష్ అడిగితే.. దేవాన్ష్ ఏ మాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పాడు. ఇదే విషయాన్ని నారా లోకేష్ సోషల్ మీడియాలో ప్రస్తావించారు. దీనికి సంబంధించిన స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
నారా దేవాన్ష్ కొంతకాలంగా శిలాజాలు.. పురాతన సంఘటనలు.. వందల సంవత్సరాల క్రితం జీవించిన జంతువులు.. వంటి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాను తెలుసుకున్న విషయాలను.. పాడ్ కాస్ట్ రూపంలో చెప్పడానికి నారా దేవాన్ష్ ప్రయత్నిస్తున్నారు. నారా లోకేష్ ప్రోమో వీడియో రిలీజ్ చేయడంతో.. నారా దేవాన్ష్ యూట్యూబ్ ఛానల్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
#DinoDeets #DevaanshPodcast
Woke up this morning… slightly confusedThe room was suddenly filled with dinosaurs… dinosaur books, dinosaur paintings, dinosaur toys everywhere. I was wondering what exactly was going on.
Then Devaansh revealed the reason.
INTRODUCING:… pic.twitter.com/AUTX9QMGd8
— Lokesh Nara (@naralokesh) May 17, 2026