Frozen In Time: సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో పలు వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఒక వీడియోలో రోడ్డుపై నడుస్తున్న మహిళ ఉన్నట్టుండి విగ్రహంలా మారిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇది టైమ్ ట్రావెల్ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియో మొదట్లో చూసినప్పుడు ఏమీ తేడా కనిపించదు. ముందుగా ఒక మహళ రోడ్డుమీద వెళుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆమె ఉన్నట్టుండి ఆగిపోతుంది. కొద్ది సెకెన్ల తరువాత తిరిగి నడుస్తుంది. ఆ కాసేపట్లో జరిగింది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
బొమ్మలా కనిపించింది…
ఈ వీడియోను తొలుత టిక్‌టాక్‌లో షేర్ చేశారు. రోడ్డుపై నడుస్తున్న ఆమె సడ¯Œ గా ఆగిపోయే సరికి ఆమె ఒక బొమ్మలా కనిపించింది. ఈ వీడియోను రికార్డు చేసిన వ్యక్తి ‘ఆమె ఒక్కసారిగా ఎందుకలా ఆగిపోయింది? కొద్దసేపటికి తిరిగి ఎందుకు నడిచింది? అని ప్రశ్నిస్తున్నారు. టిక్‌టాక్‌లో వైరల్ అయిన ఈ వీడియోను ఇప్పటి వరకూ 4.8 మిలియన్లకుపైగా నెటిజన్లు వీక్షించారు. 4.60 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. వేలసంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ట్విట్టర్, ఫేస్బుక్ ప్లాట్పారంలలోనూ షేర్ అయ్యింది.
నెటిజన్ల కామెంట్..
ఒక యూజర్ ఈ వీడియోపై కామెంట్ చేస్తూ ‘వైఫై చెడిపోయింది. ఒక సెకెను పాటు డిస్కనెక్ట్ అయ్యింది’అని పేర్కొన్నారు. కొందరు ఆమె రోడ్డు మీద స్టాచ్యూ గేమ్ ఆడుతోంది అని, కొందరు ఎవరైనా మంత్రం వేశారేమో అని.. ఇలా భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు. కాగా గతంలోనూ ఇటువంటి టైమ్ ట్రావెల్ వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. అయితే అవేవీ నిర్ధారణ కాలేదు.
Internet Attempts To Get To Bottom Of Viral Video In Which Woman Appears Literally Frozen In Time pic.twitter.com/0i8y9oqol6
— Know Your Meme (@knowyourmeme) July 17, 2023