Homeట్రెండింగ్ న్యూస్Anand Mahindra Tweet: ఇండియాలో మంచం కారు తయారీ.. ఎలన్‌మస్క్‌ ఇండియాకి ఇంకేం వస్తాడు ?.....

Anand Mahindra Tweet: ఇండియాలో మంచం కారు తయారీ.. ఎలన్‌మస్క్‌ ఇండియాకి ఇంకేం వస్తాడు ?.. వైరల్‌ వీడియో!

Anand Mahindra Tweet: మంచాన్ని వాహనంగా మార్చగల సమర్థులు ఘనులు మన భారతీయులు మాత్రమే చేయగలరు.. అవును, సోషల్‌ మీడియాలో అలాంటి ఒక వీడియో వైరల్‌ అవుతోంది. ఇది మిమ్మల్ని నవ్వించడమే కాకుండా ఆలోచింప జేస్తుంది. కార్ల తయారీ దిగ్గజ కంపెనీ టెస్లా యజమాని ఎలన్‌ మస్క్‌ బహుశా ఇలాంటి టాలెంట్‌ చూసేనేమో ఇండియాకు రావడానికి భయపడుతోంది అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. మోటార్‌ వాహనదాల తయారీ దిగ్గజ కంపెనీ మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాను కూడా ఈ వీడియో ఆకట్టుకుంది. ట్విట్టర్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై ఆసక్తికరమైన కామెంట్‌ రాశారు.

టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న ఆనంద్‌ మహీద్రా..
మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ధనిక, పేద అని తేడాల ఏకుండా టాలెంట్‌ ఉన్నవారిని ఎంకరేజ్‌ చేస్తారు. తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఆసక్తిర, ప్రేరణాత్మకమైన, చమత్కారమైన ట్యాగ్‌ జోడించి షేర్‌ చేస్తారు. ఆయన చేసిన పోస్టులు వైరల్‌ అవుతాయి. తాజాగా ఆయన షేర్‌ చేసిన ఓ పోస్టు అందరినీ ఆలోచింపజేస్తోంది. జూన్‌ 10 న, మహీంద్రా ఒక వ్యక్తి యొక్క అసాధారణమైన ప్రతిభను కీర్తిస్తూ ట్వీట్‌ చేశాడు. మంచాన్ని వామనంగా మార్చిన అతని టాలెంట్‌ను అభినందించారు. వైరల్‌ వీడియోను ట్విట్టర్‌లో మొదట మంజారి దాస్‌ అనే వినియోగదారు పంచుకున్నారు. దీనిని ఆనంద్‌ మహీంద్రా తిరిగి మార్చారు. ఈ వీడియోను తనకు కనీసం పది మంది స్నేహితులు పంపించాడని అతను పేర్కొన్నాడు. ‘నేను కనీసం పది మంది స్నేహితుల నుంచి ఈ వీడియోను స్వీకరించాను, నేను దానిని రీ ట్వీట్‌ చేయలేదు. ఎందుకంటే ఇది ఆసక్తికరంగానే ఉంది. కానీ, చాలా నిబంధనలను కూడా ఉల్లంఘిస్తుంది’ అని ట్వీట్టర్‌లో రాసుకొచ్చారు.

లీటర్‌ పెట్రోల్‌ పోస్తే రోడ్డుమీద రయ్‌ రయ్‌..
జీవితాన్ని సులభతరం చేసుకునే ప్రక్రియలోప్రజలు జుగాద్‌ ద్వారా ఇలాంటి ఎన్నో అద్భుతాలు, ఆవిష్కరణలు కనిపెడుతుంటారు. మట్టి కుండతో ఎయిర్‌ కూలర్, టేబుల్‌ ఫ్యాన్‌తో ఏసీ లాంటి చల్లదనం, సైకిల్‌ను బైక్‌గా మార్చేసిన అనేక వీడియోలు ఇప్పటికే మనం సోషల్‌ మీడియాలో అనేకం చూశాం. వాటిని చూశాక.. ఇది కూడా సాధ్యమేనా అనే సందేహం కలుగకమానదు. ఈ కుర్రాళ్ల జుగాద్‌ కూడా అలాంటిదే. ఇక్కడ ఓ యువకుడు ఇంట్లో నిరుపయోగంగా పడివున్న చక్రాలు, మోటారు బిగించి మంచాన్ని కదిలే వాహనంగా తయారు చేశాడు. అదేలా ఉందో వైరల్‌ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రస్తుతానికి, వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారు అనేది మాత్రం తెలియరాలేదు.

ట్విట్టర్‌లో వైరల్‌..
ఇన్నోవేటివ్‌ జుగాడ్‌ అనే క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో ఈ వీడియో పోస్ట్‌ చేసింది. ఆ కదిలే మంచం వెహికిల్‌ పై కూర్చుని ఆ ఇద్దరు యువకులు పెట్రోల్‌ పంప్‌కు రావటం వీడియోలో కనిపించింది. అందులో ఒకరు మంచ వాహనాన్ని డ్రైవ్‌ చేస్తున్నట్టుగా కనిపించింది. అయితే, ఆ వాహనంలో వారు పెట్రోల్‌ కొట్టించేందుకు వచ్చారు. దీంతో పెట్రోల్‌ పంపు వద్ద నిలబడి ఉన్న వాహనదారులు, స్థానిక ప్రజలు విచిత్ర వాహనాన్ని వింతగా చూస్తుండి పోయారు. ఇదేం బండిరా సామీ అనుకుంటూ అందరూ తమ సెల్‌ఫోన్‌ కెమెరాలో ఫొటోలు, వీడియోలు తీయటం మొదలుపెట్టారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular