
Old Man Bike Riding: బలగం.. ఇటీవల చిన్న సినిమాగా విడుదలై పెద్ద సంచలనం సృష్టిస్తోంది. 50 రోజులుగా థియేటర్లతోపాటు, గ్రామాల్లోనూ ప్రదర్శించబడుతోంది. తాత చనిపోతే.. తర్వాత 11 రోజుల్లో పేద, మధ్య తరగతి కుటుంబాల్లో జరిగే ఘటనల ఆధారంగా కథను నడిపించాడు డైరెక్టర్ వేణు. అయితే ఇప్పుడు ఇక్కడో తాతా తాను బలగం 2.O అన్నట్లుగా దూసుకుపోతున్నాడు. 20 ఏళ్ల కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోను అన్నట్లుగా ఆరు పదుల వయసులోనూ ఒళ్లు జలదరించే బైక్ రైడింగ్‌తో ఫీట్స్ చేస్తున్నాడు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజర్లు కామెంట్స్ పెడుతున్నారు.
బైక్‌పై ఫీట్స్..
ఆ వీడియోల కనిపిస్తున్న తాత వయసు 60 ఏళ్లకు పైనే ఉంటుంది. అయినా తాను 20 ఏళ్ల కుర్రాడినే అన్నట్లు బైక్ రైడింగ్ చేస్తున్నాడు. మేఘాలలో తేలిపొమ్మన్నది..తూఫానుల రేగిపొమ్మన్నది అన్నట్లుగా దూసుకుపోతున్నాడు. అంతే కాదు బైక్‌పై చేతులు వదిలేసి.. వెనక సీటుపై పడుకుని, డ్యాన్స్ చేస్తూ డ్రైవ్ చేస్తూ ఫీట్స్ చేస్తున్నాడు.
పట్టు తప్పితే పరలోకానికే..
తన వయసుకు, తాను చేస్తున్న ఫీట్లకు ఏమాత్రం సంబంధం లేకపోయినా.. తాతలో ఉత్సాహం చూస్తుంటే మాత్రం హుషారేస్తుంది. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని శ్రీశ్రీ అన్నట్లు.. నేడు చాలా మంది యువకులు చదువులు, ఉద్యోగం అంటూ ఆట పాటలకు, శారీరక శ్రమకు దూరం అవుతున్నారు. శ్రీశ్రీ చెప్పిన మాటను అక్షర సత్యం చేస్తున్నారు. కానీ, ఈ తాత మాత్రం తాను ఇంకా కుర్రాడినే అన్నట్లు చెలరేగిపోతున్నాడు. అయితే పట్టు తప్పితే మాత్రం పరలోకానికి వెళ్లడం ఖాయం. ఎందుకంటే ఆ తాత చేస్తున్నవి మామూలు ఫీట్లు కావు. హైవేపై అటూ ఇటూ వాహనాలు వెళ్తున్నా భయం లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. ఫీట్స్ చేస్తున్నాడు.

నెట్టింట్లో వైరల్..
రోడ్డుపై దూసుకుపోతూ తాత చేస్తున్న ఫీట్స్‌ను వీడియో తీసున కొందరు దానిని సోషల్ మీడియలో పోస్టు చేశారు. కొంతమంది అయితే తాత ఫీట్స్‌కు బలగంలోని పాటను బ్యాక్‌గ్రౌండ్‌గా జోడించి షేర్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సామాజికవ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసినవారు లైక్, షేర్ చేస్తున్నారు. కొందరు తాతా నువ్వు తోపు అని… కొంతమందేమో.. ఈ వయసు అవసరమా అని.. మరికొంతమంది తాతా పోతావ్ అని, ఇంకొందరు తాతా ఈరోజుల్లోనే ఇలా ఉంటే.. ఆరోజుల్లో ఎలా ఉండేవాడో.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఎంతైనా ఆరు పదుల వయసు దాటినా.. తాతాలో కుర్రతనం పోలేదు. కుర్రకారుకే సవాల్ విసురుతున్నాడు. మరి ఈ వీడియో పోలీసుల కంట్లో పడితే మాత్రం తాతాకు తప్పట్లో.. తాళాలు మోగడం ఖాయం.