Homeఎంటర్టైన్మెంట్Singer Sunitha Daughter: అందానికే అందం: సింగర్ సునీత కుమార్తెను చూశారా?

Singer Sunitha Daughter: అందానికే అందం: సింగర్ సునీత కుమార్తెను చూశారా?

singer sunitha Daughter
singer sunitha Daughter

Singer Sunita Daughter: సింగర్ సునీత.. తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు. ఎంత బాగా పాడుతుందో… అంతకంటే ఎక్కువ అందంగా ఉంటుంది. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు చిత్ర పరిశ్రమపై ఆమె చెరగని ముద్ర వేశారు. న్యాయ నిర్మితగా, పాడుతా తీయగా వంటి కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు. గులాబీ సినిమాలో “ఈ వేళలో నీవు” పాట ఆమెకు సినిమాలపరంగా తొలి సాంగ్. 19 సంవత్సరాల వయసులోనే నచ్చిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత భర్తతో విభేదాలు పొడ చూపడంతో విడిపోయారు. ఆయినప్పటికీ పిల్లలు ఆకాష్, శ్రేయను మంచి చదువులు చదివించారు.

singer sunitha Daughter
singer sunitha Daughter

మొదటి భర్తతో విడాకుల తర్వాత ఆమె మ్యాంగో రామ్ ను రెండో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతోంది.. ఇక సునీత కుమారుడు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కే రాఘవేంద్రరావు నిర్మాణంలో తెరకెక్కుతున్న సర్కార్ నౌకరి అనే చిత్రం ద్వారా అతడు పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నాడు. గంగన మోని శేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

సునీత కుమార్తె శ్రేయ కూడా.. తన తల్లి లాగే అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి విదేశాల్లో చదువుకుంటున్నది. నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి అనే సినిమాలో “టిక్ టిక్ టిక్” అనే పాట పాడి అందరిని అలరించింది. శ్రేయ గాత్రం చాలా బాగుంటుందని అప్పట్లో సంగీత దర్శకుడు కీరవాణి కితాబిచ్చారు. ఇక విదేశాల్లో చదువుకుంటున్న కుమార్తెను చూసేందుకు సునీత అక్కడికి వెళ్లారు. తన కూతుర్ని చూసి ఎమోషనల్ అయ్యారు. ఆ క్షణం తన జీవితంలో వెలకట్టలేనిదని ఇన్ స్టా గ్రామ్ లో రాస్కొచ్చారు. అయితే టిక్ టిక్ టిక్ పాట ద్వారా అందరినీ అలరించిన శ్రేయ తల్లిలాగా సింగర్ అవుతుందో, లేక తన అన్నలాగా ఇండస్ట్రీలో అడుగుపెడుతుందో వేచి చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular