Bengaluru Metro: చుట్టూ నలుగురు ఉన్నారన్న భయం లేదు. ఎవరైనా ఏమనుకుంటారన్న బెదురు లేదు. అది పబ్లిక్ ప్లేస్ అన్న ధ్యాస లేదు. అందరూ చూస్తుండగానే పాడు పనికి దిగారు. ముద్దులతో రెచ్చిపోయారు. అంతకుమించి అనేలా కౌగిలింతలతో కలకలం రేపారు ఆ జంట. ఇంతకీ ఎక్కడో తెలుసా? బెంగళూరులోని ఓ మెట్రో రైల్లో. ఇటీవల మెట్రో రైళ్లు ప్రేమికుల ఆగడాలకు వేదికలుగా మారిపోయాయి. ఇటీవల చాలాజంటల ఆగడాలు సోషల్ మీడియాలోవైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా బెంగళూరు మెట్రోలో జరిగిన ఘటన కూడా ట్రోల్ అవుతోంది.
ఆ రైలులో పదిమంది వరకు ప్రయాణికులు ఉన్నారు. రైలు కదులుతుండగా ఓ ప్రేమ జంట హఠాత్తుగా ప్రత్యక్షమైంది. కౌగిలింతలు, ముద్దులతో రెచ్చిపోయారు. మరింత రెచ్చిపోతుండడాన్ని సహించలేని తోటి ప్రయాణికుల్లో ఒకరు ఆ దృశ్యాన్ని వీడియో తీసిసోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పబ్లిక్ రైళ్లలో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఇటువంటి వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ను, పోలీసులను డిమాండ్ చేస్తూ ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పబ్లిక్ ప్లేసులో అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.
మొన్న ఆ మధ్యన ఢిల్లీలో ఇటువంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. హోలీ నాడు రైలులో ప్రయాణిస్తూ ఇద్దరు యువతులు అదర చుంబనాలతో రెచ్చిపోయారు. సీక్రెట్ ప్లేస్లలో తాకుతూ సెల్ఫీ దిగారు. అప్పటికే ఆ రైలులో పదుల సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. అప్పట్లో కూడా ఆ వీడియోను ఒక ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అదో సంచలనంగా మారింది. ఇప్పుడు కూడా అటువంటి ఘటనే రిపీట్ అయింది.
Hey @OfficialBMRCL @NammaMetro_ @BlrCityPolice
what happening in Namma metro
slowly Bangalore metro are turning into Delhi metro
Take some action on them
The girl was literally kissing the boy pic.twitter.com/p3pdi2vM7I— KPSB 52 (@Sam459om) May 5, 2024