Vijay Devarakonda childhood pic goes viral on social media
Star Hero: పైన గ్రూప్ ఫొటోలో ఉన్న ఓ అబ్బాయి ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా పరిశ్రమలో ఎదిగాడు. ఈ హీరోకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అమ్మాయిలు పడి చస్తారు. మరి ఆ హీరో ఎవరో ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు. మీ ఊహ నిజమే. ఈ గ్రూప్ ఫోటోలో ఉన్న కుర్రాడు విజయ్ దేవరకొండ. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన విజయ్ దేవరకొండ హీరో కావాలని కలలు కన్నాడు. ఆ దిశగా అడుగులు వేశాడు. ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
2011లో రవిబాబు తెరకెక్కించిన నువ్విలా చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. నువ్విలా మూవీలో ఓ చిన్న పాత్ర చేశాడు. అనంతరం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో ఛాన్స్ వచ్చింది. అందులో కూడా విజయ్ దేవరకొండ పెద్దగా ప్రాధాన్యత లేని సపోర్టింగ్ రోల్ లో కనిపించాడు. విజయ్ దేవరకొండ దర్శక నిర్మాతల కంట్లో పడేలా చేసింది ఎవడే సుబ్రహ్మణ్యం? మూవీ. హీరో నాని ఫ్రెండ్ గా విజయ్ దేవరకొండ ఇంపార్టెంట్ రోల్ చేశాడు.
2016లో పెళ్లి చూపులు చిత్రంతో హీరో అయ్యాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ రొమాంటిక్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మంచి విజయం సాధించింది. అలాగే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి గాను దర్శకుడు తరుణ్ భాస్కర్ జాతీయ అవార్డు అందుకున్నారు. ఇక అర్జున్ రెడ్డి మూవీతో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. టాలీవుడ్ సెన్సేషనల్ మూవీగా అర్జున్ రెడ్డి అవతరించింది.
అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ కొట్టింది. విజయ్ దేవరకొండకు గీత గోవిందం మూవీ స్టార్ హోదా తెచ్చింది. వంద కోట్లకు పైగా వసూళ్లతో గీత గోవిందం భారీ లాభాలు రాబట్టింది. విజయ్ దేవరకొండ స్టార్ హీరోల లిస్ట్ లో చేరాడు. గీత గోవిందం తర్వాత ఆ రేంజ్ హిట్ విజయ్ దేవరకొండకు పడలేదు. అయినా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. నేడు విజయ్ దేవరకొండ బర్త్ డే కాగా రెండు కొత్త చిత్రాలు ప్రకటించాడు.
Web Title: Vijay devarakonda childhood pic goes viral on social media