https://oktelugu.com/

Snakes: కర్ర పుల్లలు కాదు.. కాలనాగులు.. ఏం తిప్పుతున్నావ్ రా స్వామీ.. కాటేస్తే ఖతమే!

ఈ వీడియలోని యువకుడు ఆరు పాములను ఒకేసారి పట్టుకుని... కర్ర పుల్లలను చేతులతో పట్టుకున్నట్లు ఆటలాడుతూ కనిపించాడు. తర్వాత వాటిని తాళ్లను పట్టుకున్నట్లుగా పట్టుకుని ఆడించాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 9, 2024 / 02:31 PM IST

    Snakes

    Follow us on

    Snakes: పాము.. ఈ పేరు వింటేనే ఒళ్లు జలధరిస్తుంది. కనిపిస్తే మాత్రం భయంతో అక్కడి నుంచి పరుగు అందుకుంటాం. పాములు అంటే అందరికీ అంత భయం ఉంటుంది. అవి కాటేస్తే ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే.. తీవ్రతను బట్టి గంటల వ్యవధిలో ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అందుకే అందరూ పాములకు దూరంగా ఉంటారు. అయితే ఇక్కడ ఓ యువకుడు పాములతో ఆటలాడుకుంటున్నాడు. ఒకటి రెండు కాదు.. ఏకంగా ఆరు పాములను ఒకేసారి పట్టుకుని ఆటాడుతూ వీడియోకు ఫోజులిచ్చాడు. ఇది రీల్‌ కోసం చేశాడా.. లేక అతని వృత్తి పాములు పట్టడమో తెలియదు కానీ, ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్‌ అవుతోంది.

    కర్రలతో ఆడినట్లు..
    ఈ వీడియలోని యువకుడు ఆరు పాములను ఒకేసారి పట్టుకుని… కర్ర పుల్లలను చేతులతో పట్టుకున్నట్లు ఆటలాడుతూ కనిపించాడు. తర్వాత వాటిని తాళ్లను పట్టుకున్నట్లుగా పట్టుకుని ఆడించాడు. విషపూరితమైన సర్పాలను ఆడిస్తున్న వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవుతోంది. ఈ విడియోను చూసినవాళ్లు ఆ యువకుడికి వార్నింగ్‌ ఇస్తున్నారు. కొంతమంది అతడి సాహసాని అభినందిస్తున్నారు. అయితే పాములతో ఆటలు మంచివి కావాలని హెచ్చరిస్తున్నారు. జంతు ప్రేమికులు పాములను హింసిచడాన్ని తప్పు పడుతున్నారు.

    ఏడు రోజుల్లో 88 వేలకుపైగా లైక్స్‌..
    ఇక ఈ స్టంట్‌కు సంబంధించిన వీడియోను వారం క్రితం సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో సూర్యపుత్ర–రాయల్‌ –యోగ్య అనే హ్యాండిల్‌లో షేర్‌ చేశారు. ఈ పోస్టుకు ‘‘ర్యాట్‌ స్నేక్‌’’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. వారం రోజుల్లో ఈ ఓస్టుకు 88 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అయితే పాములతో ఆటలాడడంపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీల్స్‌ కోసం ఇలా చేసి ఉంటే.. ఆరు పాముల్లో ఏ ఒక్కటి కాటేసినా కాటికే పోవడం ఖాయం అని హెచ్చరిస్తున్నారు.