Rare Baby Cow: కలియుగంలో వింతలు, విశేషాలు చోటు చేసుకుంటాయని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆనాడే చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు అక్షరాలా నిజం అవుతున్నాయి. ఈ యుగంలో ఏ మూలకో జరుగుతూనే ఉండటం వింటుంటాం. బ్రహ్మంగారు చెప్పిన ఒక్కోటి వెలుగు చూస్తూనే ఉంది. కాలాల్లో మార్పులొస్తాయని చెప్పారు. అత్తలకు పీటలు కోడళ్లకు మంచాలు వేస్తారని ఆనాడే భవిష్యత్ ను ఊహించారు. ముఖానికి రంగేసుకునే వారు రాజ్యాలేలతారని వెల్లడించారు.

నిత్యం ఏదో ఓ చోట ఇలాంటివి జరుగుతూనే ఉంటున్నాయి. ఊహించనివి జరిగినప్పుడు సామాజిక మాధ్యమాలు వైరల్ చేస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో ప్రపంచంలో ఎక్కడ జరిగినా చిటికెలో ప్రత్యక్షమవుతోంది. దీంతో బ్రహ్మంగారు ఆనాడే చెప్పారనే కామెంట్లు కోకొల్లలుగా రావడం సహజం. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం మురళీనగర్ లో ఓ వింతైన ఘటన జరిగింది. దేవిశెట్టి రత్నాజీ అనే రైతు ఇంట్లో ఓ గేదె 8 కాళ్లతో జన్మించింది. దీన్ని చూసేందుకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. జన్యుపరమైన లోపంతోనే దూడ ఇలా జన్మంచిందని వైద్యులు చెబుతున్నా ఇదో కలియుగ వింతగానే చెబుతున్నారు.
రెండు వెన్నెముకలు 8 కాళ్లతో జన్మించిన దూడను చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. వైద్య పరీక్షలు కూడా చేయించారు. సమాజంలో ఎక్కడో ఓ చోట ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఘటన చూసి యుగాంతం వచ్చేసిందని చర్చించుకున్నారు. మనుషుల్లో కూడా విపరీత ధోరణులు పెరిగిపోతున్నాయని పలు రకాల కామెంట్లు చేస్తుండటం విశేషం. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన విషయాలు మనకు కళ్లెదుటే సాక్షాత్కరిస్తున్నాయి. దీంతోనే చాలా మంది వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు.

నంది కడుపున పంది పుడుతుందని చెప్పారు. ఆవు పంది పిల్లకు పాలిస్తుందని సెలవిచ్చారు. బ్రహ్మంగారు చెప్పిన విషయాలే ఇప్పుడు మన కళ్లకు కట్టినట్లు కనిపించడంతో ఇక కలియుగంలో ఇంకా ఏం వింతలు జరుగుతాయోనని ఆసక్తి కనబరుస్తున్నారు. హిందువులు గోమాతను దైవంగా భావించడం సహజమే. దానికి తినుబండారాలు తినిపించి మొక్కుతుంటారు. గోమూత్రాన్ని కూడా అత్యంత శుభప్రదమైన నీరుగా చెబుతుంటారు. ఇంటిని సంప్రోక్షణ చేసేందుకు గోమూత్రాన్నే వాడతారు. ఇలా జంతువులకు మనుషులకు అవినాభావ సంబంధం ఉంది.
ఏపీలో వింత దూడ జననం అందరిని ఆలోచనల్లో ముంచేసింది. అసలు జరగకూడనివి జరుగుతున్నాయని భయపడుతున్నారు. వింతలు చూసి ఇక కాలం దగ్గరకొస్తుందని నిరాశావాదంలో మాట్లాడుతున్నారు. కలియుగంలో ఇంకా ఎన్ని వింతలు చూస్తామోనని చెబుతుండటం విశేషం.