Chennai: జులాయి సినిమా చూశారా? ఆ సినిమా క్లైమాక్స్లో ఎవరి దగ్గరైతే డబ్బులను అక్రమంగా దోచేస్తారో.. చివరికి ఆ డబ్బులు ఆ ఖాతాదారుల వద్దకే చేరుతాయి. ఖాతాదారులు దాచుకున్న సొమ్మును బ్యాంకు నుంచి దొంగతనం చేసిన అక్రమార్కులు దానిని విదేశాలకు తరలించేందుకు ట్రక్కులో భద్రపరుస్తారు. అయితే ఆ ట్రక్ బ్రేక్ డౌన్ అయ్యి ఖాతా దారుల వద్దకు వచ్చి ఆగుతుంది. అదంటే సినిమా కాబట్టి సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి. నిజ జీవితంలో అలా జరుగుతుందా? అంటే దీనికి అవును అనే సమాధానం వస్తున్నది. అయితే ఇక్కడ అక్రమార్కులు, బ్యాంక్ రోబరీ లాంటింది జరగలేదు కానీ.. సినిమాకు మించి ట్విస్ట్ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో మీరూ చదివేయండి.
రిజర్వ్ బ్యాంక్ నుంచి..
మనదేశంలో బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ నగదు ఇస్తుంది. ఆ నగదును ట్రక్కుల ద్వారా అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య పంపిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంపించిన ఆ నగదుతో బ్యాంకు ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ నగదు పంపే విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తుంది. ఈ నగదును ట్రక్ లోకి ఎక్కించిన తర్వాత ఈ సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతుంది. నగదు పంపించే వాహనానికి చుట్టూ ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేస్తుంది. దానికి జీపీఎస్ ట్రాక్ కూడా ఉంటుంది. ట్రక్ బయలుదేరేముందు స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం అందిస్తుంది.. ఇలా జాగ్రత్తలు పాటిస్తుంది కాబట్టే డబ్బు పంపే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవు.
విల్లుపురం బయలుదేరింది
అయితే తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం ప్రాంతంలో బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹535 కోట్ల నగదును ట్రక్ ద్వారా పంపింది.. డబ్బును పంపే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..ఈసారి ఎందుకో విఫలమైనట్టు తెలుస్తోంది.. వాహనం విల్లుపురానికి వెళుతున్న క్రమంలో తాంబరం వద్ద బ్రేక్ డౌన్ అయ్యింది.. దీంతో ట్రక్ డ్రైవర్ లో ఆందోళన మొదలైంది.. లోపల ₹535 కోట్ల నగదు ఉండడంతో అతడు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు.. దీంతో వారు ఆ సంఘటన స్థలానికి వచ్చి ట్రక్కుకు భద్రత కల్పించారు.. అప్పటికే చుట్టుపక్కల ఉన్నవారు భారీగా గుమిగూడటంతో లూటికి ఆస్కారం ఉంటుందని డ్రైవర్ భయపడ్డాడు. పోలీసులు రావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. పోలీసులు వచ్చి అక్కడ గుమి గూడిన జనాన్ని చెదరగొట్టారు. వాహనానికి మరమ్మతులు చేసి అనంతరం తాంబారం పంపించారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
View this post on Instagram