Kranti Drillman: రికార్డుల కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాధన చేస్తారు. కానీ రికార్డు కొందరినే వరిస్తుంది. కొందరు అద్భుతమైన జ్ఞాపక శక్తితో రికార్డు సృష్టిస్తారు. కొందరు డాన్స్‌తో, కొందరు క్రీడలతో గిన్నిస్ బుక్‌లో పేరు నమోదు చేసుకుంటారు. కొందరు గోళ్లు, జుట్టు పెంచడం ద్వారా రికార్డు సృష్టించారు.
గిన్నిస్ రికార్డు సాధించడం అంత ఈజీ కాదు. దీనికోసం ప్రత్యేకంగా సాధన చేస్తారు. అనేక ప్రయత్నాల తర్వాత విజయం సాధిస్తారు. పాత రికార్డులను బ్రేక్ చేయడానికి కూడా చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఇక కొందరు వినూత్నంగా ప్రయత్నిస్తారు. అలాంటి వారిలో గోళ్లు పెంచుకునేవారు, జుట్టు పెంచుకునేవారు, జుట్టుతో సిలిండర్ లాగడం, వాహనాలు లాగడం చేసేవారు ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి అందరికన్నా భిన్నంగా ప్రయత్నించాలనుకున్నాడు. సక్సెస్ అయ్యాడు. గిన్నిస్ రికార్డులకెక్కాడు. స్పీడ్‌గా తిరుగుతున్న ఫ్యాన్ రెక్కలు ఆపడం ద్వారా రికార్డు అతడి సొంతమైంది.
నాలుకతో ఫ్యాన్ ఆపి..
తిరుగుతున్న ఫ్యాన్‌ను చేతులతో ఆపడమే కష్టం. చేతులకు గాయాలవుతాయి. కానీ, క్రాంతి డ్రిల్మాన్ అనే యువకుడు నాలుకతో ఎలక్ట్రిక్ ఫ్యాన్ రెక్కలు ఆపి రికార్డు సృష్టించాడు. నిమిషంలో 57 ఫ్యాన్ రెక్కలను నాలుకతో ఆపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చూసేందకు సింపుల్‌గా అనిపించినా అది అంత ఈజీ కాదు. ఫ్యాన్ రెక్కలు స్పీడ్‌గా తిరుగుతున్న సమయంలో నాలుక తెగిపోయే ప్రమాదం ఉంది. కానీ కఠోర సాధన, శ్రమతో క్రాంతి డ్రిల్మాన్ ఈ ఫీట్ సాధించి గిన్నిస్‌బుక్‌లో తన పేరు లిఖించుకున్నాడు. దీనికి సంబందించిన వీడియోను జీడబ్ల్యూఆర్ షేర్ చేసింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: A telangana man has set a guinness record for stopping 57 electric fans with his tongue
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com