Duvvada: ఒక్కోసారి ఏమరుపాటు మనకు గ్రహపాటు తెస్తుంది. అంతా బాగుందని అనుకున్నా ఏదో విధి మనల్ని వెంటాడుతుంది. ఫలితంగా మన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. గ్రహపాటు మనకు ఎడబాటు అవుతుంది. విధి ఆడిన వింత నాటకంలో మనకు చింతే మిగులుతుంది. ప్రాణాలు పోయేలా చేయడంలో విధి కన్నా ఎవరు శత్రువులు ఉండరు. హాయిగా కళాశాలలో చదువుతున్న ఓ అమ్మాయి దురదృష్ట వశాత్తు చనిపోయిన ఘటన విశాఖలో చోటుచేసుకుంది. రైలు ప్రమాదంలో గాయపడిన ఆ అమ్మాయి తుది శ్వాస విడిచింది. అందరిని కలచివేసిన సంఘటన మనసులను బాధించింది. కొద్దిసేపైతే ఇంటికి చేరుతుందని అనుకున్న ఆమె ప్రాణాలనే విడిచిపెట్టింది.

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సమీపంలోని గోపాలపట్నంకు చెందిన మెరపాల శశికళ (20) దువ్వాడలోని ఓ కళాశాలలో ఎంసీఏ చదువుతోంది. రోజు అన్నవరం నుంచి రైలులో దువ్వాడ వెళ్తూ వస్తోంది. ఎప్పటిలాగే బుధవారం కూడా గుంటూరు రాయగడ ప్యాసింజర్ రైలులో కళాశాలకు చేరుకుంది. అనంతరం తిరుగు ప్రయాణంలో రైలు దిగుతుండగా రైలుకు ప్లాట్ ఫారంకు మధ్యలో పడిపోయింది. దీంతో అందరు కేకలు వేశారు. రైలు చైన్ లాగారు. ట్రైన్ ఆగినా ఆ అమ్మాయిని బయటకు తీసేందుకు దాదాపు గంటన్నర పట్టింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించినా మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచింది.
రైలుకు ప్లాట్ ఫారానికి మధ్యలో ఇరుక్కుపోయి రెండు గంటల పాటు నరకం అనుభవించింది. ఆస్పత్రికి తరలించగా కోమాలోకి వెళ్లింది. దీంతో ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. కిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్న ఆమె కోలుకోవాలని అందరు పూజలు చేశారు. కానీ విధి ఆమెను వెంటాడింది. ప్రాణాలను తీసుకెళ్లింది. హృదయ విదారకర సంఘటనను చూసిన అందరు కన్నీరు కార్చారు. ఆమె కోలుకోవాలని ఎంతో వేడుకున్నారు. కానీ ఆమెకు ఆయుష్షు తగ్గింది. ఆ దైవానికి కన్ను కుట్టింది. ఆమెను తనలోనే కలుపేసుకుంది.

అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ తల్లిదండ్రులకు శోకమే మిగిలింది. తమకు ఎదిగొస్తుందని అనుకున్న అమ్మాయి విగత జీవిగా మారడంతో వారి ఆర్తనాదం మిన్నంటింది. తమ కూతురు మధ్యలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తమను సాకుతుందని అనుకుంటే తమ చేతే తలకొరివి పెట్టించుకుంటోందని ఏడ్చారు. ఒక్కోసారి మనకు తెలియకుండానే ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఏ పాపం చేసిందని ఆమెను విధి పొట్టన పెట్టుకుంది. ఏ నేరం చేసిందని ఆమెను తీసుకుపోయిందని అందరు కంట కన్నీరు కార్చారు.