
Pini Village: భారతదేశం అనేక సంస్కృతులు, సంప్రదాయాలకు పుట్టినిల్లు. అందుకే భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ఇక్కడ ఎందరో జీవనం కొనసాగిస్తున్నారు. ఏ నగరం తీసుకున్నా విభిన్న జాతుల సమ్మేళనం. మన సంస్కృతిని చూసి పాశ్చాత్య దేశాలు కూడా మురిసిపోతాయి. ఇటీవల కాలంలో మనమే వారి రీతులను అనుసరిస్తున్నాం. వారి వస్త్రధారణను ఇష్టపడుతున్నాం. వారు మాత్రం మన దుస్తుల అమరికను ఆస్వాదిస్తుంటారు. మన వివాహ వ్యవస్థను చూసి మురిసిపోతుంటారు. ఒకసారి వివాహం చేసుకుని జీవితాంతం కలిసుంటే పెళ్లి తంతును ఎంతో ఆరాధిస్తారు. వారు కూడా మన లాగే చేసుకోవాలని ఆరాటపడుతుంటారు.
హిమాచల్ ప్రదేశ్ ..
హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలోని పినీ గ్రామంలో ఓ విచిత్ర ఆచారం ఉంది. వారు శ్రావణ మాసంలో ఐదు రోజుల పాటు దుస్తులు ధరించకుండా నగ్నంగానే తిరుగుతారు. పూర్తిగా కాకుండా పలుచని వస్త్రాలు ధరిస్తారు. పురుషులు కూడా అదే విధంగా చేస్తారు. ఆ సమయంలో గ్రామంలోకి ఎవరిని రానివ్వరు. వారు కూడా ఎవరికి తారసపడరు. దీంతో వారు పాటించే ఆచారం ఇప్పటిది కాదు. పూర్వ కాలంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఇక్కడి వారు ఇలా ప్రవర్తిస్తారని చెబుతుంటారు.
ఏంటా ఆచారం?
ఆ గ్రామంలో పూర్వం రాక్షసులు తిరిగే వారట. వారు మహిళల దుస్తులను చింపి తీసుకెళ్లే వారట. వీరిని లహువా ఘోండ్ అనే దేవత ప్రత్యక్షమై రక్షించిందట. భాద్రపద మాసంలో తొలిరోజు ఈ ఘటన చోటుచేసుకుంని చెబుతుంటారు. దీంతో ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఐదు రోజులు దుస్తులు ధరించకుండా తిరుగుతారట. ఈ సమయంలో వారు మద్యం తాగకూడదు. మాంసం తినకూడదు. భార్యాభర్తలు కలుసుకోకూడదు. ఈ నిబంధనలు ఎవరు ఉల్లంఘించకూడదు. ఇలాంటి కఠిన నియమాలతో వారు ఐదు రోజులు గడపడం విశేషం.

ఎప్పటి నుంచి?
ఈ ఆచారం శతాబ్ధాల నుంచి వస్తోంది. వీరి ఆచారం ప్రకారం ఇలా ఐదు రోజులు పాటించకపోతే మంచిది కాదనే నమ్మకంతో ఆ ఊరు గ్రామస్తులు కఠినమైన నిబంధనలతో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. పినీ గ్రామస్తులు చేస్తున్న ఆచారంతోనే వారికి మంచి జరుగుతుందని వారి విశ్వాసం. ఈ నేథ్యంలో వేల ఏళ్లుగా వారు కొనసాగిస్తున్నా ఆచారం వింతగా ఉన్నా ఇది వాస్తవమే పలుచని వస్త్రాలు ధరించి ఉంటారు. ఎవరితో మాట్లాడరు. మగవారు సైతం అలాగే ఉండాలి. గమ్మత్తైన ఆచారాలు మన దేశంలో ఎన్నో ఉన్న సంగతి తెలుసు.