Homeట్రెండింగ్ న్యూస్Ongole Cow: ఒంగోలు ఆవుకు అన్ని కోట్లా.. అసలేంటి దాని ప్రత్యేకత.. ఎందుకు అంత రేటు?

Ongole Cow: ఒంగోలు ఆవుకు అన్ని కోట్లా.. అసలేంటి దాని ప్రత్యేకత.. ఎందుకు అంత రేటు?

Ongole Cow: “ఒంగోలు గిత్త. సాటిలేని సత్తా..” దాని సామర్థ్యం ఆధారంగానే.. పై నానుడి పుట్టింది. చురకత్తిలాంటి చూపు.. ఆకాశాన్ని తాకే గంగడోలు.. మొనదేలిన కొమ్ములు.. ఎంతటి బరువునైనా అవలీలగా లాగేసే మెడ.. విశాలమైన దేహం. అంతకుమించి బలమైన కాళ్లు.. కాంక్రీట్ పిల్లర్ల మాదిరి గిట్టలు.. చెప్పుకుంటూ పోతే ఒంగోలు జాతి పశువులు వర్ణనకు అందవు.. అయితే మన దేశం నుంచి ఒంగోలు జాతి పశువులను తీసుకెళ్లిన బ్రెజిల్ దేశస్తులు.. రకరకాల ప్రయోగాలు చేసి అద్భుతమైన పశు జాతులను సృష్టించారు.

మనదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఒంగోలు జాతి ఆవులు, గిత్తలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వీటిని కొనేందుకు లక్షల్లో ఖర్చు చేసేందుకు రైతులు వెనకాడరు. ఆ మధ్య అఖండ సినిమాలో సందడి చేసిన గిత్తలు ఒంగోలు జాతికి చెందినవే.. భారతదేశంలో నిర్వహించే ఏ ఎద్దుల పందెంలోనైనా ఒంగోలు గిత్తలదే పై చేయి. పైగా ఈ పశువులకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంటుంది..రాజసానికి, పౌరుషానికి ప్రతీకగా నిలిచే ఒంగోలు జాతి ఆవు.. ఇటీవల నిర్వహించిన వేలంలో కళ్ళు చెదిరిపోయే ధర పలికింది.

ముందుగానే చెప్పినట్టు బ్రెజిల్ దేశంలో ఒంగోలు జాతిని అనేక రకాలుగా అభివృద్ధి చేశారు. అక్కడ రైతులకు పశుపోషణ మీద విపరీతమైన మక్కువ ఉంటుంది. ముఖ్యంగా మన దేశానికి చెందిన ఒంగోలుతోపాటు గీర్ వంటి పశువుల జాతిని కూడా అక్కడి దేశస్తులు అభివృద్ధి చేసి సరికొత్త రకాలను ఉత్పత్తి చేశారు. ఒంగోలు జాతి ఆవులు, గిత్తల మీద అనేక ప్రయోగాలు చేసి రూపొందించిన జాతులు అక్కడ ఔరా అనిపించేలా ఉంటాయి. ప్రతి ఏడాది బ్రెజిల్ దేశంలో పశువుల వేలం జరుగుతుంది.. పలు రకాల పశువులు అక్కడ వేలానికి వస్తుంటాయి. ఎన్నో రకాల ఆవులు, గిత్తలు వచ్చినప్పటికీ అక్కడ ఒంగోలు రకానికి చెందిన పశువులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.

ఇటీవల జరిగిన ఓ వేలంలో అక్కడ ఒంగోలు జాతి ఆవు గత రికార్డులు మొత్తం బద్దలు కొట్టింది. బ్రెజిల్ దేశంలోని ని సావ్ పాల్ ప్రాంతంలోని అరండూ లో జరిగిన వేలంలో నాలుగున్నర సంవత్సరాలు ఉన్న ఓ ఒంగోలు జాతి ఆవు ఏకంగా 4.8 మిలియన్ అమెరికన్ డాలర్ల ధర పలికింది.. అంటే మన కరెన్సీలో 40 కోట్లు. గతంలో ఈ ప్రాంతంలో ఐవీఎఫ్ ద్వారా సృష్టించిన అనే పేరు ఉన్న ఒంగోలు ఆవు దాదాపు 15 కోట్లకు అమ్ముడుపోయింది. ఇప్పటివరకు ఆ ఆవు పేరు మీద రికార్డు ఉండేది. అయితే దానిని ఈ ఆవు బద్దలు కొట్టేసింది. ఒంగోలు ఆవులకు బ్రెజిల్ దేశంలో గతంలో నిర్వహించిన వేలాలలో ఈ స్థాయిలో ధర ఎవరూ చెల్లించలేదు

40 కోట్ల ధర పలికిన ఆవు పేరు “వియాటినా -19 ఎఫ్ఐవీ”. ఈ ఆవు నెల్లూరు జాతికి చెందింది. ఇక ఈ ఆవు ఎలాంటి వాతావరణంలోనైనా జీవించగలదు. రెడ్డి చర్మం అత్యంత దృఢంగా ఉంటుంది. రక్తం పిలిచే కీటకాల నుంచి తట్టుకోగలవు. ఒంగోలు ఆవులు ఎక్కువ పాలిస్తుంటాయి. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. వాటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బ్రెజిల్ దేశంలో ఒంగోలు జాతి పశువుల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. (బ్రెజిల్ దేశస్తులు ఒంగోలు జాతి గిత్తల వీర్యం ద్వారా సరికొత్త జాతులను కనిపెట్టడానికి ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి.)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular