Bala Gopaludu Child Artist: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాన్ని సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు… బాలయ్య లాంటి నటుడు సైతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో భారీ సక్సెస్ ను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు…
Also Read: ఖరీదైన కారు కొన్న కేజీఎఫ్ స్టార్ యష్.. ధర ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం ఖాయం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు బాలయ్య బాబు(Balayya) కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ప్రస్తుతం తనతో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు సైతం పోటీ పడుతున్నారు… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న నటుడు మాత్రం బాలయ్య బాబు అనే చెప్పాలి. కెరియర్ మొదటి నుంచి ఎన్నో ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేస్తూ వస్తున్న ఆయన మొత్తానికైతే మాస్ లో మంచి ఫాలోయింగ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు…ఇక బాలయ్య బాబు ఒకప్పుడు కోడి రామకృష్ణ డైరెక్షన్ లో చేసిన ‘బాలగోపాలుడు’ (Balagopaludu) సినిమాలో రాశి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక ఆమెతో పాటు కళ్యాణ్ రామ్ (Kalyan Ram) కూడా ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం విశేషం…ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
ఇక కాలక్రమేనా ఆమె హీరోయిన్ గా మారడంతో బాలయ్య బాబు ముత్యాల సుబ్బయ్య (Mutyala Subbayya) దర్శకత్వంలో చేసిన కృష్ణ బాబు (Krishna Babu) సినిమాలో రాశి (Rashi) హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విజయాన్ని సాధించలేదు. అయినప్పటికి బాలయ్య బాబుకి రాశి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందనే వార్తలు కూడా వచ్చాయి. ఇక తర్వాత వీళ్ళకి కాంబినేషన్ లో మరో సినిమా అయితే రాలేదు.
మరి ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు లాంటి నటుడు చేయడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…60 సంవత్సరాల పైబడిన వయసులో కూడా వరుసగా నాలుగు విజయాలను సాధించిన ఆయన ఇప్పుడు మరో విజయంతో ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో చేస్తున్న ‘అఖండ 2’ (Akhanda 2) సినిమాతో భారీ విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…