https://oktelugu.com/

Uttarpradesh : వివాహితకు కడుపు చేసి.. అనంతరం స్నేహితులతో కలిసి దారుణం

నీతో మాట్లాలని ఉందని.. ఒకసారి ఇంటి వద్దకు రావాలని యువతిని కోరాడు. ఆమె వచ్చీరాగానే బలమైన రాయితీతో దాడిచేయడంతో ఆమె కుప్పకూలింది. వెంటనే స్నేహితుల సాయంతో మృతదేహాన్ని సమీప పొలాల్లో విసిరేసి పరారయ్యాడు.

Written By:
  • Dharma
  • , Updated On : July 6, 2023 / 06:11 PM IST
    Follow us on

    Uttarpradesh : భర్త నుంచి దూరంగా వచ్చేసిన మహిళపై యువకుడు కన్నేశాడు. ఆమె లొంగిపోవడంతో మస్త్ మజా చేశాడు. కొన్నేళ్ల పాటు ఎంజాయ్ చేశాడు. తీరా ఆమె గర్భం దాల్చింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వే అంటూ చెప్పింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెంచింది. ఈ పరిణామంతో షాక్ కు గురైన సదరు యువకుడు ఆమెను కిరాతకంగా చంపేశాడు. మృతదేహాన్ని పొలాల్లో వేసి పరారయ్యాడు. పోలీసు విచారణలో ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అని నిర్థారణ అయ్యింది. ఉత్తరప్రదేశ్ లోని మేరట్ జిల్లాలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి.

    మేరట్ జిల్లాకు చెందిన ఓ మహిళకు 2015లో వివాహం జరిగింది. కానీ దంపతుల మధ్య తరచూ వివాదాలు జరుగుతుండడంతో ఏడాదికే సదరు యువతి పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుంచి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అదే ప్రాంతంలో ఉంటున్న ఆదేష్ అనే యువకుడు ఆమెపై కన్నేశాడు. ప్రేమించానని వెంటపడ్డాడు. ఆమెను లొంగదీసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరూ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఇటీవల ఆమె గర్భం దాల్చింది. తన కడుపులో ఉన్న బిడ్డకు తండ్రివి నివేనంటూ ఆదేష్ కు చెప్పింది, పెళ్లి చేసుకోవాలని కోరింది. కానీ ఆదేష్ తప్పించుకొని తిరిగేవాడు. ఇటీవల పెళ్లి ఒత్తిడి పెరగడంతో ఎలాగైనా యువతి అడ్డు తొలగించుకోవాలని డిసైడయ్యాడు.

    స్నేహితులైన దీపక్, ఆర్యన్, సందీప్, రోహిత్ లతో ఆదేష్ వ్యూహం రూపొందించాడు. నీతో మాట్లాలని ఉందని.. ఒకసారి ఇంటి వద్దకు రావాలని యువతిని కోరాడు. ఆమె వచ్చీరాగానే బలమైన రాయితీతో దాడిచేయడంతో ఆమె కుప్పకూలింది. వెంటనే స్నేహితుల సాయంతో మృతదేహాన్ని సమీప పొలాల్లో విసిరేసి పరారయ్యాడు. మృతదేహం వెలుగులోకి రావడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఆదేష్ తో సన్నిహితంగా ఉంటుందని తేలడం.. ఆదేష్ పరారీకావడంతో ఆయన ఆచూకీ వెతికే పనిలో పోలీసులు పడ్డారు. ఆదేశ్ తో పాటు నలుగురు స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.