Uttar Pradesh: హైదరాబాద్ లో కుక్క ఘటన తరువాత వాటిని చూస్తే ప్రతి ఒక్కరికి భయం వేస్తోంది. కానీ ఆ జంతువుల్లో కూడా మంచివి ఉంటాయని చాలా మంది నమ్ముతారు. అందుకే కుక్కలను ఎక్కువగా పెంచుకుంటారు. విశ్వాసానికి మారుపేరుగా నిలిచే శునకం మనుషుల కంటే ఎంతో నమ్మకంగా ఉంటుందని భావించి వాటిని ప్రేమగా చూస్తారు. యజమాని పెట్టే పిరికెడు అన్నం కోసం ఆయనను కాపాడేందుకు ప్రాణాలను సైతం ఇస్తుంది. ఇదే కోవలో ఓ కుక్క తన యజమానిని కాపాడబోయి ప్రాణాలు తీసుకుంది. కొన్ని కారణాల వల్ల యజమాని ఆత్మహత్య చేసుకుంటుంగా అతనిని కాపాడేందుకు శాయశక్తులా పోరాడింది. కానీ ఫలితం లేకుండా పోయింది. కన్నీళ్లు పెట్టించే ఈ ఘటన వివరాలేంటో చూద్దాం.
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో ని పంచవతి కాలనీలో సంభవ్ అగ్నిహోత్రి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న ఈ 23 ఏళ్ల వ్యక్తికి కుక్కలంటే ప్రాణం. అందుకే ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే అగ్నిహోత్రి తండ్రి ఆనంద్ రైల్వే ఉద్యోగి. తల్లి అనారోగ్యంతో బాధపడుతుంటే చికిత్స కోసం ఆమెను భోపాల్ కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అగ్ని హోత్రి ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు.
గత ఆదివారం రాత్రి అగ్నిహోత్రి ఉరేసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో అగ్నిహోత్రి తండ్రి ఫోన్ చేశారు. ఫోన్ లిప్ట్ కాకపోవడంతో పక్కనున్న వారికి కాల్ చేశారు. వారు వెళ్లి చూడగా డోర్లు పెట్టి ఉన్నాయి. అంతేకాకుండా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారికి కుక్క అడ్డుకుంది. యజమాని చనిపోయాడన్న విషయం కుక్కకు తెలియదు. కానీ తనను కాపాడుదామన్న క్రమంలో ఎవరినీ లోపలికి రానివ్వలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులను సైతం సైతం కుక్క అడ్డుకుంది. దీంతో వారు చేసేదేమీ లేక ఆ కుక్కకు మత్తు మందు ఇచ్చారు. ఆ తరువాత దానిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక ఆనంద్ ఇంటి డోర్ తెరిచి చూడగా అగ్నిహోత్రి ఉరేసుకొని కనిపించాడు. అయితే మత్తు మందు డోస్ ఎక్కువ కావడంతో ఆ కుక్క ప్రాణాలు విడిచింది. యజమానితో పాటు తాను కూడా చనిపోవడం అందరినీ కలిచివేసింది.
యజమానిని కాపాడేందుకు కుక్క ఎవరినీ లోపలికి రానియకుండా చూసుకుందంటే ఆ కుక్క ఎంత విశ్వాసం కలదో దీనిని భట్టి చూస్తే అర్థమవుతుంది. అయితే వాటిని ప్రేమతో చూస్తేనే.. అవి మనకు నమ్మకంగా ఉంటాయనేది మరిచిపోవద్దని జంతు ప్రేమికులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో రావడంతో వైరల్ గామారింది. యజమాని, కుక్కకు ఉన్న బంధం చూసి ఎమోషనల్ అవుతున్నారు.