https://oktelugu.com/

Viral Video: గుడిలో ప్రదక్షిణలు చేస్తుండగా.. గుండెపోటు.. అందరూ చూస్తుండగానే యువకుడి దుర్మరణం.. వైరల్ వీడియో

కార్తీక మాసం కావడంతో ఆ యువకుడు గుడికి వెళ్ళాడు. దేవుడికి దణ్ణం పెట్టుకున్నాడు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఇంతలోనే అతడికి గుండెపోటు వచ్చింది. అందరూ చూస్తుండగానే కిందపడిపోయి కన్నుమూశాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 12, 2024 / 06:12 PM IST

    Viral Video(7)

    Follow us on

    Viral Video: ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా కదిరి మండలానికి చెందిన కే విష్ణువర్ధన్ (31) హైదరాబాదులోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నాడు. హాస్టల్ లో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. విష్ణుకు దైవభక్తి ఎక్కువ. అతడికి ప్రతిరోజు గుడికి వెళ్లే అలవాటు ఉంది. ఆంజనేయస్వామికి అతడు వీరభక్తుడు. ఈ క్రమంలో సోమవారం ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. అవి ముగిసిన తర్వాత ఆలయానికి పక్కనే ఉన్న ధ్యాన మందిరం మెట్టపై కూర్చున్నాడు. ఆ తర్వాత అందరికీ చాలా ఇబ్బందిగా అనిపించింది. దాహం గా ఉండడంతో ఫిల్టర్ దగ్గరికి వెళ్ళాడు. అతడు వెళ్తున్న తీరును ఆలయ అర్చకుడు పరిశీలిస్తూనే ఉన్నాడు.. ఫిల్టర్ దగ్గరికి వెళ్ళినాథుడు ఒకసారిగా కింద పడిపోయాడు. దీంతో అక్కడే ఉన్న అర్చకుడు కేకలు వేస్తూనే ఉన్నాడు. కొంతమంది భక్తులు వెంటనే స్పందించి అతడికి సిపిఆర్ చేశారు. ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించేలోపే విష్ణు కన్నుమూశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు గుడిలో ఉన్న సిసి కెమెరాలు రికార్డు అయ్యాయి. విష్ణు కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్నాడు. కాస్త స్వస్థత అనిపించడంతో ఆలయానికి వెళ్ళాడు. గుడి చుట్టు ప్రదక్షిణలు చేశాడు. అస్పస్థతగా అనిపించడంతో ఫిల్టర్ దగ్గరికి వెళ్లి నీళ్లు తాగడానికి ప్రయత్నించాడు. కానీ చివరికి అక్కడికక్కడే కుప్పకూలిపోయి కన్నుమూశాడు. ఈ విషయాన్ని స్థానికులు అతని కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. వారు ఆస్పత్రికి వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. ఆ తర్వాత తమ సొంత ప్రాంతానికి తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం అతడికి అంత్యక్రియలు చేశారు.. విష్ణువర్ధన్ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    ఈ తరహా కేసులు పెరిగిపోతున్నాయి

    ఇటీవల కాలంలో గుండెపోటు కేసులు పెరిగిపోతున్నాయి. ఆకస్మికంగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. వయసు తేడా లేకుండా గుండెపోట్లు సంభవిస్తున్నాయి. అప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉన్నవారు గుండెపోటు వల్ల కింద పడిపోయి కన్నుమూస్తున్నారు. అయితే గుండెపోటు లక్షణాలను ముందస్తుగా అంచనా వేలకపోవడంతో ఇటువంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. గుండెపోటు వచ్చినప్పుడు సాధారణంగా చాతిలో ఎడమవైపు విపరీతమైన నొప్పి వస్తుంది. మన సామర్థ్యానికి మించిన బరువు మోస్తున్న భావన కలుగుతుంది. ఆయాసం వస్తుంది చెమటలు పడతాయి. అయితే ఇటువంటి లక్షణాలు లేకుండానే కొంతమందికి గుండెపోటు వస్తుందని వైద్యులు అంటున్నారు. ఇక ఇటీవల తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయుడు విధి నిర్వహణలో ఉండగా గుండెపోటు వచ్చి కన్నుమూశాడు. ఇక ఇదే ప్రాంతంలో 55 సంవత్సరాల వయసున్న వ్యక్తి తన పొలంలో గడ్డి కోస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. అతనికి ఎటువంటి లక్షణాలు లేకపోయినప్పటికీ గుండెపోటు రావడం.. ఆ సమయంలో అతడు అక్కడే పడిపోవడంతో ఎవరూ గుర్తించలేదు. చివరికి అతడు అక్కడికక్కడే కన్నుమూశాడు. ప్రస్తుత కాలంలో గుండెపోటు మరణాలు పెరిగిపోయిన నేపథ్యంలో.. జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. 35 ఏళ్లు దాటిన తర్వాత గుండె పని తీరును.. రక్తపోటును ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు. వ్యాయామం చేయడం.. సమతులమైన ఆహారం తీసుకోవడం.. నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండడం వంటివి చెయ్యాలని.. వ్యాయామన్ని దినసరి చర్యలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.