https://oktelugu.com/

KTR Case: కేటీఆర్ అరెస్ట్ తప్పదా? గవర్నర్ నిర్ణయంపైనే అందరి దృష్టి?

తెలంగాణలో కీలక నేత కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమవుతున్నదా? ఫార్ములా ఈ రేసు కేసులో ఆయన పూర్తిగా ఇరుక్కుపోయారా? ఆయన అతి త్వరలోనే ఏసీబీ అదుపులోకి తీసుకోపోబోతున్నదా..? అనే అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : November 12, 2024 / 06:06 PM IST

    KTR

    Follow us on

    KTR Case: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ రేసు ఉచ్చు బిగుస్తున్నది. తన శాఖ నుంచి పెద్ద మొత్తంలో నగదు విడుదల చేసినట్లుగా గుర్తించి ఈ కేసును నమోదు చేశారు. అయితే ఈ కేసును రేవంత్ సర్కారు సీరియస్ గా తీసుకుంది. కొంతకాలంగా కేటీఆర్ అరెస్టు ఖాయమంటూ ప్రచారం జరుగుతున్నది. ఇదిలా ఉంటే సోమవారం ఈ కేసు విషయంలోనే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని అధికార పక్షం ఆరోపిస్తున్నది. కేంద్ర పెద్దలను కలిసి వారి నుంచి రక్షణ పొందనున్నారని తెలిసింది. దీనిపై మంత్రులు సీతక్క, పొన్నం, పొంగులేటి సహా పలువురు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బీ టీమ్ బీఆర్ఎస్ అని కవిత విడుదల విషయంలోనూ అదే జరిగిందంటూ చెప్పుకొచ్చారు. గవర్నర్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేటీఆర్ కూడా ముందుగానే ఢిల్లీకి చేరుకున్నారు.. కేంద్రంలో కీలకంగా ఉన్న కొందరు వ్యక్తులను కలిసినట్లుగా కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. కేసుల మాఫీకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లాడని ఎద్దేవా చేశారు.

    గవర్నర్ నిర్ణయంపైనే..
    ఇక గవర్నర్ నిర్ణయంపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. మంత్రిగా పని చేసిన కేటీఆర్ ను అరెస్ట్ చేయాలంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 17 ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ కు ఒక లేఖ రాసింది. అయితే అటార్నీ జనరల్ ను సంప్రదించిన అనంతరమే గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక వీరిద్ధరు ఈవిషయంలో కేంద్రాన్ని సంప్రదించిన తర్వాతే తుది ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. అయితే గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై చర్చ జోరుగా సాగుతున్నది.

    బీజేపీ సహకరిస్తుందా?
    గతంలో రాష్ర్టంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ కేటీఆర్ కు సహకరిస్తుందా.. లేదా అనేది అనుమానంగానే ఉంది. ఇప్పటికే కవిత విడుదల సమయంలో బీజేపీ సహకరించిందనే టాక్ వినిపించింది. ఇక చట్టం తన పని తాను చేసుకోనివ్వకుండా కేటీఆర్ అరెస్టును ఆపితే బీజేపీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది.

    అయితే, బీఆర్ఎస్ విలీనంపై ఏదైనా నిర్ణయం జరిగితే నే కేటీఆర్ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుంటే కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ ఆదేశిస్తే బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. ఏదేమైనా గవర్నర్ ఆదేశాలు రెండు, మూడు రోజుల్లో ఉండొచ్చని తెలుస్తున్నది. ఏదేమైనా ఫార్ములా ఈ రేసు కేసును రేవంత్ సర్కారు వదిలేలా లేదు.

    ఇక, ఇప్పటికే దూకుడుగా ముందుకు వెళ్తున్న ఏసీబీ ఈ కేసును మరింత సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో కేటీఆర్ అరెస్టు దాదాపు ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ తగిలినట్లేనని భావిస్తున్నది.