https://oktelugu.com/

AP Government: ఆ పెట్టుబడుల రాకతో గుజరాత్ సరసన ఏపీ

మంత్రి నారా లోకేష్ మంత్రాంగం ఫలించింది.ఆయన కృషి మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. 65 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. 2.5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి

Written By:
  • Dharma
  • , Updated On : November 12, 2024 / 06:15 PM IST

    CM Chandrababu

    Follow us on

    AP Government: ఏపీలో కూటమి ప్రభుత్వం పెట్టుబడులపై ఫోకస్ పెట్టింది. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. సీఎం చంద్రబాబు ఒకవైపు, మంత్రి లోకేష్ మరోవైపు ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చంద్రబాబు వరుసగా పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ఇంకోవైపు మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటించారు. అక్కడ దిగ్గజ కంపెనీ ప్రతినిధులను కలిసి.. ఏపీలో ఉన్న సానుకూల వాతావరణాన్ని వారికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. రాజా కాల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చింది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో ఏకంగా 65 కోట్లతో.. 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. క్లీన్ ఎనర్జీ కింద ఈ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. గుజరాత్ కాకుండా వేరే రాష్ట్రానికి వస్తున్న అతిపెద్ద పెట్టుబడి కూడా ఇదే. ఇప్పటికే ప్రముఖకంపెనీలన్నీ ఏపీ వైపు చూస్తున్నాయి.ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముందుకు రావడంతో మార్గం మరింత సుగుమం అయ్యింది.

    * ఒక్కో ప్లాంట్ నిర్మాణానికి రూ.130 కోట్లు
    ఏపీలో నిర్మితం కానున్న ఈ ప్లాంట్ ఒక్కొక్క దానిని 130 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు. బంజరు భూముల్లోనే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాంట్లు ఏర్పాటు అయితే రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల 50వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్ కు అనంత్ అంబానీతో మంత్రి నారా లోకేష్ పెట్టుబడులకు సంబంధించి ప్రణాళికలను ఖరారు చేశారు. ఈరోజు ఏపీ పరిశ్రమల శాఖ, రిలయన్స్ మధ్య ఈ పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం జరగనుంది. సీఎం చంద్రబాబు సమక్షంలోనే ఒప్పందం చేసుకొనున్నారు.

    * ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు
    ఇటీవల ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద.. జీవ ఇంధన ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు తీసుకొచ్చింది ఏపీ సర్కార్. అయితే ఈ రిలయన్స్ ప్లాంట్లకు ప్రభుత్వం అన్ని రకాల రాయితీలు అందించనుంది. జీఎస్టీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ కింద పన్నుల రాయితీ అందించనుంది.రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ప్రకటించారు నారా లోకేష్.రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని… పెట్టుబడులు పెట్టేందుకుపారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పుకొచ్చారు.ఐదేళ్లపాటు ఇదే పరంపర కొనసాగుతుందని కూడా తేల్చి చెప్పారు.